
Sri Lakshmi Narasimha Swamy's festival
నేటి ధాత్రి కథలాపూర్
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం దుంపేట్ గ్రామంలో కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారు గా బావించే స్వయంభూ గా వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి జాతర మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈరోజు శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవ వేడుక అంగరంగ వైభవంగా భక్తుల సమక్షంలో కనుల పండగ కొనసాగింది.
స్వామివారి కల్యాణ మహోత్సవ కార్యక్రమంలో గ్రామ ప్రజలు భక్తులు వివిధ గ్రామాల ప్రజలు పాల్గొని స్వామివారిని దర్శించుకుని పునీతులు కావడం జరిగింది.