ప్రకృతిపై విద్యార్థులకు అవగాహన
నస్పూర్, (మంచిర్యాల) నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ కృష్ణవేణి హై స్కూల్ విద్యార్థులను సోమవారం రోజున మందమర్రి లోని సింగరేణి పార్క్ కు విద్యార్థులను పిక్నిక్ తీసుకపోవడం జరిగింది. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు బత్తిని దేవన్న మాట్లాడుతూ
పాఠశాల విద్యార్థులకు విద్యతో పాటు జ్ఞానాన్ని అందించడమే లక్ష్యంగా ప్రతి సంవత్సరం విద్యార్థులను వివిధ ప్రాంతాలను చూపెడతామని అన్నారు. అలాగే విద్యార్థులు సింగరేణి పార్క్ మందమర్రి ని సందర్శించడం జరిగింది. పర్యావరణ పరిరక్షణ భాగంగా చెట్లను మనం రక్షిస్తే చెట్లు మనల్ని రక్షిస్తాయని వివరించారు.ఫ్రీ ప్రైమరీ విద్యార్థులతో గుడ్ మేనర్ ఆక్టివిటీ కాన్సెప్ట్ లు వివరించారు.మరియు
విద్యార్థులతో ఆటలు పాటలు కల్చరల్ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు,సిబ్బంది పాల్గొన్నారు.