శ్రీ చైతన్య పాఠశాల ముందు నిరసన వ్యక్తం చేసిన ఏఐఎస్బి నాయకులు
తదనంతరం మండల విద్యాశాఖ అధికారికి చర్యలు తీసుకోవాలని మెమోరాండం
ఏ.ఐ.ఎస్.బి జిల్లా నాయకులు వెల్డి సాయికిరణ్ రెడ్డి
చేర్యాల నేటిధాత్రి….
చేర్యాల పురపాలక సంఘం పరిధిలోని శ్రీ చైతన్య స్కూల్ ఆస్తి పన్ను బకాయి చెల్లించలేదని కారణంతో శుక్రవారం చేర్యాల మున్సిపల్ అధికారులు సిబ్బందితో కలిసి పాఠశాలకు తాళం వెయ్యడం వల్ల విద్యార్థులు పాఠశాలకు వెళ్లలేక పరీక్షల ముందు విద్యార్థులనూ నట్టేట ముంచుతున్న శ్రీ చైతన్య పాఠశాలనూ సీజ్ చెయ్యాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సాయికిరణ్ రెడ్డి మాట్లాడుతూ…. యాజమాన్యం మరియు బిల్డింగ్ యజమాని ఆస్తి పన్ను కట్టకుండా ఉండడం వల్ల పాఠశాలకు మున్సిపల్ అధికారులు తాళం వెయ్యడం వల్ల విద్యార్థులకు
పరీక్షలకు ముందు ఇలా జరగడం వళ్ళ విద్యార్థులు వారి తల్లితండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అన్నారు. వెంటనే ఎంఈఓ, డీఈవో, మరియు అధికారులు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు శివతేజ, సాకేత్, శ్రీధర్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.