శ్రీ రాచణ్ణ స్వామి దేవస్థానం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి బడంపేట జాతర మహోత్సవాలు
ప్రత్యేక పూజలు పాల్గోని
⏩::యంపి సురేష్ కుమార్ షేట్కర్
⏩::మాజీ మంత్రివర్యులు జహీరాబాద్ ఇన్ చార్జి డాక్టర్ ఏ చంద్రశేఖర్
జహీరాబాద్. నేటి ధాత్రి:

బడంపేట: యంపి సురేష్ కుమార్ షేట్కర్ తో కలిసి మాజీ మంత్రివర్యులు డాక్టర్ ఏ చంద్రశేఖర్ కోహిర్ మండల పరిధిలోని బడంపేట గ్రామం లో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి జాతర మహోత్సవాల్లో పాల్గోని ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు ఆలయం అర్చకులు నిర్వాహకులు స్వాగతం పలికి తీర్థం ప్రసాదాలు అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వామి అమ్మవార్ల కృప నియోజకవర్గ ప్రజల పై ఉండాలని ఆకాంక్షించారు, ఆలయ అభివృద్ధికి కృషి చేస్తాం అని అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు రామలింగారెడ్డి , హన్మంతరావు పటేల్ ,శ్రీనివాస్ రెడ్డి , మహ్మద్ మక్సుద్ అహ్మద్ ,జహిరాబాద్ పట్టణ అధ్యక్షుడు కండెం నర్సింహులు, శుక్లా వర్ధన్ రెడ్డి మాజీ వైస్ యంపిపి శాఖీర్ అలీ , ఐన్టియుసిఏఫ్ జిల్లా అధ్యక్షులు రాజ్ కుమార్ నాయకులు దయానంద్ పటేల్ , ప్రభాకర్,శ్రీపాల్ , గోపాల్ ,అరుణ్ కుమార్,సుధీర్ .మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.