
మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
మహబూబ్ నగర్ జిల్లాలోని
స్థానిక ప్రభుత్వ ఎన్టీఆర్ మహిళా డిగ్రీ కళాశాలలో ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ప్రిన్సిపల్ కెప్టెన్ డాక్టర్ ఎం విజయ్ కుమార్ మరియు క్రీడలు మరియు సాంస్కృతిక కమిటీ మెంబర్స్ క్రీడలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించిన బ్రోచర్ ఆవిష్కరించారు .
సోమవారం కళాశాల ప్రిన్సిపల్ కెప్టెన్ ఎం.డాక్టర్ విజయ్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులలో క్రీడలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలపై ప్రేరణ కలిగే విధంగా స్పోర్ట్స్ మరియు గేమ్స్ వివిధ భౌతిక మరియు యు యుహాత్మక సవాళ్లు సహా చురుకైన శారీరక కార్యకలాపాలు సంబంధం కలిగి ఉంటాయన్నారు.
రాష్ట్ర ,జాతీయ ,అంతర్జాతీయ స్థాయిలో మహబూబ్ నగర్ ఎన్ టి ఆర్ మహిళా డిగ్రీ కళాశాల నుండి ఎంతోమంది విద్యార్థులు పాల్గొనడం జరిగిందని తెలిపారు.ఇంకా రాబోయే రోజుల్లో చదువుతోపాటు క్రీడారంగంలో కూడా ప్రేరణ కలిగే విధంగా విద్యార్థులను తయారు చేయాలనే ఉద్దేశంతో మొదటగా కళాశాల స్థాయిలో తర్వాత జిల్లా స్థాయిలో ఆ తర్వాత క్లస్టర్ స్థాయిలో వివిధ రకాల క్రీడలను ఎన్టీఆర్ జిడిసి ఉమెన్ కప్ అనే పేరుతో నిర్వహించడం జరుగుతుందని కళాశాల ప్రిన్సిపల్ పేర్కొన్నారు.