కోలాహలంగా మారిన సెయింట్ జోసెఫ్స్ హై స్కూల్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి
చుంచుపల్లి. మండలంలోని దంబాద్ పంచాయతిలో ఉన్న సెయింట్ జోసెఫ్స్ హై స్కూల్ నందు కె జి విద్యార్థిని విద్యార్థులచే బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించబడింది.ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా ప్రిన్సిపాల్ బ్రదర్ రాజశేఖర్ రెడ్డి వైస్ ప్రిన్సిపల్ జార్జి రెడ్డి బ్రదర్ అభిలాష్ విచ్చేశారు అంతరం బతుకమ్మ విశిష్ఠతను వివరించినారు. 6 తరగతి నుంచి 10 తరగతి వరకు స్పోర్స్ డే కార్యక్రమంలో ఘనంగా నిర్వహించబడింది. ముఖ్యఅతిథిగా ప్రిన్సిపాల్ బ్రదర్ రాజశేఖర్ రెడ్డి బ్రదర్ అభిలాష్ చేతుల మీదుగా టార్చ్ ని వెలిగించి ఈ క్రీడా పోటీలు ప్రారంభించారు.నిన్నటి వరకు ఎస్ఎ1 పరీక్షలు ప్రశాంత వాతావరణంలో రాసిన విద్యార్థిని విద్యార్థులు ఈరోజు స్కూల్ ఆవరణమంతా బతకమ్మ పాటలతో మరోవైపు క్రీడల పోటీలతో స్కూల్ ఆవరణమంతా కోలాహలంగా మారిపోయింది.ఈ కార్యక్రమానికి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు