
మందమర్రి, నేటిధాత్రి:-
ఏరియాలోని ఎల్లందు క్లబ్ లో నవంబర్ 14,15న నిర్వహించూ కంపెనీ స్థాయి లాన్ టెన్నిస్ క్రీడా పోటీలను ఎటువంటి లోటుపాటులు లేకుండా సమర్థవంతంగా నిర్వహించాలని ఏరియా జిఎం ఏ మనోహర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన ఎల్లందు క్లబ్ ను పరిశీలించి, సంబంధిత అధికారులకు తగ్గు సలహాలు, సూచనలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏరియా పర్సనల్ మేనేజర్ ఎస్ శ్యాంసుందర్, సివిల్ డిజిఎం శ్రీనివాసులు, ఎస్ఇ జయప్రకాష్, ఏరియా వర్క్ షాప్ ఇంజనీర్ నాయక్, ఏరియా అటవీ శాఖ అధికారి రమణారెడ్డి, స్పోర్ట్స్ కోఆర్డినేటర్ ఏ రవికుమార్, జనరల్ కెప్టెన్ టి చిన్నయ్య తదితరులు పాల్గొన్నారు.