“T20 League Launched to Promote Rural Sports: Vivek Venkataswamy”
గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలను ప్రోత్సహించేందుకే ఆటల పోటీలు..
రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి
క్రీడలు మానసికొల్లాసానికి దోహదపడతాయి….
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
రామకృష్ణాపూర్ పట్టణంలోని సింగరేణి ఠాగూర్ స్టేడియంలో స్వర్గీయ కాకా వెంకటస్వామి మెమోరియల్ టి20 లీగ్ మ్యాచ్ ఖమ్మం,హైదరాబాద్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ ను చెన్నూర్ ఎమ్మెల్యే రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడారు. క్రీడలు మానసికొల్లాసానికి దోహదపడతాయని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కాకా వెంకటస్వామి మెమోరియల్ మ్యాచ్ లు నిర్వహిస్తున్నామని ఈనెల 17న ఫైనల్ మ్యాచ్ హైదరాబాద్ లో జరుగుతుందని తెలిపారు.క్రీడలలో గెలుపు ఓటములు సహజమని అన్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలను ప్రోత్సహించేందుకు ఈ టోర్నీలు నిర్వహిస్తున్నామని అన్నారు. విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ టోర్నమెంట్ లు నిర్వహిస్తున్నామని అన్నారు. రానున్న రోజుల్లో మహిళల క్రికెట్ మ్యాచ్ లు సైతం నిర్వహించేందుకు ప్రయత్నం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా డిసిపి భాస్కర్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పి రఘునాథరెడ్డి రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ జంగం కళ,మాజీ వైస్ చైర్మన్ విద్యాసాగర్ రెడ్డి,పట్టణ అధ్యక్షులు పల్లె రాజు, అధికార ప్రతినిధి వొడ్నాల శ్రీనివాస్ సీనియర్ నాయకులు గాండ్ల సమ్మయ్య, అబ్దుల్ అజీజ్, యాకూబ్ అలీ, క్రీడాకారులు,నాయకులు,ప్రజలు పాల్గొన్నారు.
