పీ ఆర్ టి యు జిల్లా ప్రధాన కార్యదర్శి పసుల శంకర్
కాటారం నేటి దాత్రి క్రీడలతో మానసిక ప్రశాంతత లభిస్తుందని, క్రీడలు శరీర దృఢత్వాన్ని పెంపొందిస్తాయని పి ఆర్ టి యు జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి పసుల శంకర్ పేర్కొన్నారు. శుక్రవారం కాటారం గ్రామపంచాయతీలోని టీచర్ కాలనీలో నిర్వహించిన కోకో క్రీడల ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. టీచర్స్ కాలనీలో గత నెల రోజుల నుండి కురసం అశోక్ కోకో శిక్షకుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కోకో వేసవి క్రీడా శిక్షణ శిబిరం శుక్రవారంతో ముగిసింది. ఈ సందర్భంగా పసుల శంకర్ మాట్లాడుతూ చిన్నతనం నుండే క్రీడలను అలవాటు చేసుకుంటే భవిష్యత్తు బాగుపడుతుందని తెలిపారు. ఇటీవల కాలంలో నేటి తరం పిల్లలు సెల్ ఫోన్ కు బానిసంగా మారుతున్నారని, క్రీడల యొక్క ఔన్నత్యాన్ని తల్లిదండ్రులు గ్రహించి పిల్లలను క్రీడలవైపు మళ్లీంచేలా చూడాలని కోరారు. క్రీడలలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనపరిస్తే విద్యా, ఉద్యోగ అవకాశాల్లో రెండు శాతం రిజర్వేషన్ లభిస్తుందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఉద్యోగులు భాస్కర్, శ్రీనివాస్, సందీప్, ఉపాధ్యాయులు అనిల్, శరత్, మహేష్ నాగరాజు, మోహన్ సీనియర్ కోకో క్రీడాకారుడు మంతెన శ్రీనివాస్, సృజన్ పాల్గొన్నారు