క్షేత్రస్థాయిలో పలు అభివృద్ధి పనుల పరిశీలన
నేటిధాత్రి, వరంగల్
వరంగల్ మున్సిపల్ కమిషనర్ వరంగల్ లోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను పర్యవేక్షించారు. అభివృద్ధి పనులలో వేగం పెంచాలని బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయి పరిశీలనలో భాగంగా శనివారం కమిషనర్ హన్మకొండ పరిధి వడ్డేపల్లి బండ్ పై కొనసాగుతున్న అభివృద్ధి పనుల పురోగతి క్షేత్ర స్థాయిలో పరిశీలించి సమర్థవంతంగా నిర్వహించుటకు తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కాంపౌండ్ పనులతో పాటు సందర్శకులు వీక్షించడానికి వీలుగా (వ్యూ డెక్)పనులు, సైకిల్ ట్రాక్ ల్యాండ్ స్కేపింగ్ పనులను జూన్ నెల వరకు పూర్తి చేయాలని, కాంట్రాక్టర్ పిఎంసి ఇరువురు సమన్వయంతో పనిచేసి బండు పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అన్నారు. అలాగే కరీంనగర్ ప్రధాన రహదారి ఏల్లాపూర్ వద్ద గ్రాండ్ ఎంట్రెన్స్ ఏర్పాటు పనులను పరిశీలించిన కమిషనర్ నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని అన్నారు. ఏనుమాముల ప్రాంతంలోని బాలాజీ జంక్షన్ వద్ద నిర్మిస్తున్న బ్యూటిఫికేషన్ పనులను పరిశీలించిన కమిషనర్ ఏర్పాటు బాగుందని, హనుమకొండ ప్రాంతంలో కూడా ఇదే తరహాలో ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని ఎస్.ఈ కు సూచించారు. నర్సంపేట ప్రధాన రహదారి వద్ద గల గ్రాండ్ ఎంట్రన్స్ పనులను పరిశీలించిన కమీషనర్ నెల లోగా స్టీల్ ఏర్పాటు పనులు పూర్తి చేయాలన్నారు. క్రిస్టియన్ కాలనీలో పర్యటించి కమ్యూనిటీ హాల్ ఏర్పాటు పనులను గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎస్.ఎన్.ఎమ్ క్లబ్ వద్ద కొనసాగుతున్న జంక్షన్ బ్యూటిఫికెషన్ పనులలో వేగం పెంచాలని ఇంజనీరింగ్ అధికారులను ఈ సందర్భంగా కమీషనర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఈ ప్రవీణ్ చంద్ర, సిఏంహెచ్ఓ డా.రాజేష్, హెచ్ఓ రమేష్, ఈఈ లు రాజయ్య, సంజయ్ కుమార్, డి.ఈ లు సంతోష్ బాబు, రవికుమార్, సారంగం, రంగారావు, కృష్ణమూర్తి, అజ్మీరా శ్రీకాంత్, ఏ.ఈ హరి కుమార్, శానిటరీ ఇన్స్పెక్టర్ లు కరుణాకర్, సంపత్ రెడ్డి, ఇశ్రం శ్రీను, స్మార్ట్ సిటీ ప్రతినిధి ఆనంద్ ఓలేటి తదితరులు పాల్గొన్నారు.