వేములవాడ రూరల్ నేటి దాత్రి
వేములవాడ రూరల్ మండలం మల్లారం గ్రామంలో జూనియర్ వెటర్నరీ ఆఫీసర్ ఎం నరేందర్ ఆధ్వర్యంలో ప్రత్యేక పశు వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది.ఈ శిబిరంలో భాగంగా 20 గేదెలు 15 ఆవులకు వైద్యం అందించి మందులు ఇవ్వడం జరిగింది.ఇట్టి పశువైద్య శిబిరంలో సిరిసిల్ల వ్యవసాయ కళాశాల రావేపు విద్యార్థినిలు సి.హెచ్ఆకాంక్ష, కావ్య, మనీషా అలేఖ్య,యం. ఆకాంక్ష , వ్యవసాయ విస్తరణ అధికారి బి సందీప్ మరియు పాడి రైతులు పాల్గొనడం జరిగింది