జహీరాబాద్ లో యాచకుల ప్రత్యేక సర్వే
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ పట్టణంలో యాచకుల కోసం మెప్మా ఆధ్వర్యంలో బుధవారం ప్రత్యేక సర్వే కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సర్వే ద్వారా పట్టణంలో యాచకులు ఎక్కడెక్కడ ఉన్నారో పూర్తి వివరాలను మెప్మా సిబ్బంది సేకరించారు. ఈ సర్వే కార్యక్రమం మరో మూడు రోజులపాటు కొనసాగుతుందని మెప్మా పట్టణ ప్రాజెక్టు అధికారి బసంత్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమం యాచకుల పునరావాసం మరియు సంక్షేమానికి దోహదపడుతుందని భావిస్తున్నారు.
