Special RTC Buses from Bhupalpally to Medaram Jatara
భూపాలపల్లి నుండి మేడారం జాతరకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులు
ఆర్టీసీ డిపో మేనేజర్ ఇందు
భూపాలపల్లి నేటిధాత్రి
టీజిఎస్ఆర్టీసీ భూపాలపల్లి డిపో నుండి మేడారం మహాజాతరకు ముందుగానే ప్రత్యేక బస్సుల ఏర్పాట్లు చేయడం జరుగుతుందని ఆర్టీసీ డిపో మేనేజర్ హిందూ తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్టీసీ బస్సులు భూపాలపల్లి నుండి చెల్పూర్, ఘనపూర్, ములుగు, గోవిందరావుపేట, పస్రా, తాడ్వాయి మీదుగా మేడారం వరకు ప్రయాణిస్తాయి.
భూపాలపల్లి నుండి మేడారం బస్సు టైమింగ్స్:
08:00, 09:00, 16:10, 17:10 గంటలకు.
మేడారం నుండి భూపాలపల్లి బస్సు టైమింగ్స్:
10:40, 11:40, 18:45, 19:45 గంటలకు.
ఈ ప్రత్యేక బస్సు సర్వీసులపై మహాలక్ష్మి పథకం కూడా వర్తిస్తుందని తెలిపారు. ప్రయాణికుల రద్దీని బట్టి అవసరమైతే అదనపు ట్రిప్పులు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.
ఈ గొప్ప అవకాశాన్ని జిల్లా ప్రజలు పరిసర ప్రాంతాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని భూపాలపల్లి డిపో మేనేజర్ ఎ. ఇందు తెలిపారు
