బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ముదిరాజ్ లకు ప్రత్యేక గౌరవం

జిల్లాలో ముదిరాజ్ సోదరులకు 30గుంటల స్థలం, భవన నిర్మాణం కోసం 1కోటి రూపాయలు మంజూరు

ఆగస్టులో కురిసిన భారీ వర్షాలతో దెబ్బతిన్న చెరువులను తిరిగి పూర్వ వైభవం తీసుకుని వస్తా.

మూడోసారి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే బండ ప్రకాష్ కి మంత్రి వర్గంలో చోటు కల్పించేలా ముఖ్యమంత్రి ని నావంతుగా కోరుతా.

భూపాలపల్లి నేటిధాత్రి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా ముదిరాజు అభినందన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ మాజీ మంత్రి,ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో ఎన్నో ప్రభుత్వాల పరిపాలన చేసిన కానీ కులవృత్తులు చేసుకునేవారి గురించి ఏ ఒక్కరు ఆలోచించలేదు.
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు గౌరవము దక్కింది.
ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన బండ ప్రకాష్ ని రాజ్యసభ సభ్యుడిగా గౌరవించింది.
తిరిగి మళ్ళీ శాసన మండలి సభ్యుడిగా, మండలి డిప్యూటీ చైర్మన్ గా నియమించింది.
రాష్ట్రంలో బి ఆర్ ఎస్ ప్రభుత్వ హయంలో నీలి విప్లవం మొదలైంది.
గతంలో ప్రజా ప్రతినిధులకు చేరువులపై హక్కులు ఉండే.
కేసీఆర్ నాయకత్వంలో పూర్తి స్థాయిలు చేరువులపై హక్కులు కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం.
పూర్తి స్థాయి రాయితీతో చేపపిల్లలను అందించిన విషయాన్ని ముదిరాజు సామాజిక వర్గ ప్రజలు గమనించాలి.
భూపాలపల్లి నియోజకవర్గ పరిధిలో ముదిరాజ్ కులస్థూల ఆత్మగౌరవ ప్రతీకగా చాలా కమ్యూనిటీ హల్ ల నిర్మాణానికి నిధులు కేటాయించడం జరిగింది
ఆగస్టు మాసంలో కురిసిన భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న చెరువుల పునరుద్ధరణ కోసం ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవతో నిదులు కేటాయించడం జరిగింది.
భూపాలపల్లి జిల్లాలో మత్స్యశాఖ సొసైటీ సహకార బ్యాంక్ మరియు సంఘాలు ఏర్పాటు చేసుకున్నాం.
రానున్న ఎన్నికల్లో భూపాలపల్లి నియోజకవర్గ పరిధిలో ముదిరాజు సోదరులకు రాజకీయంగా సముచిత స్థానం కల్పిస్తా.
ఇప్పటికే ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి సర్పంచ్, ఎంపీటీసీ జడ్పీటీసీ లుగా అవకాశం కల్పించడం జరిగింది. ప్రాజెక్ట్ నిర్మాణాల ద్వారా రాష్ట్రం గణనీయంగా నీలి విప్లవం పెరిగింది.
అసెంబ్లీ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి అభ్యర్థిగా నన్ను బలపరిచిన క్రమంలో భూపాలపల్లి నియోజకవర్గ ముదిరాజు సామాజిక వర్గ బంధావులు మీ సహాయ సహకారాలు అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో ముదిరాజ్ కుల సంఘం జిల్లా అధ్యక్షుడు జోరుక సదయ్య వివిధ మండలాల ముదిరాజ్ కుల సంఘం నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!