Special Poojas for Dattatreya Jayanti in Vanaparthi
వనపర్తి లో దత్త జయంతి సందర్భంగా వచ్చే నెల 4 న ప్రత్యేక పూజలు
వనపర్తి నేటిదాత్రి .
వనపర్తి జిల్లా కేంద్రంలో శంకర్ గంజి పుట్నాల బట్టి ప్రక్క వీధిలో శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం దత్తాత్రేయ ఆలయం లో వచ్చేనెల 4న శ్రీ దత్త జయంతి సందర్భంగా దత్తాత్రేయ స్వామికి అభిషేకాలు హోమాలు ప్రత్యేక వస్త్ర అలంకరణ పూజలు ఉంటాయని ఆలయ పురోహితులు చల్ల వెంకటేశ్వర శర్మ సలహాదారు పాండుశెట్టి ఒక ప్రకటనలో తెలిపారు .గతంలో సుబ్రహ్మణ్య స్వామి నవగ్రహాల ప్రతిష్ట చేయించామని పాండు తెలిపారు ఈ సందర్భంగా ఆలయ పూజారి మాట్లాడుతూ వేణుగోపాల స్వామి దేవాలయం 200 సంవత్సరాల క్రితం ఉన్నదని తెలిపారు శ్రీ దత్త హోమాలు త్రాలంకరణ ఉంటుందని ఆయన తెలిపారు 70 సంవత్సరాల క్రితం హరికథలు పూజలు జరిపించేవారని ఆయన గుర్తు చేశారు ఈ ఆలయానికి కలకొండ బాలకృష్ణయ్య శివ నారాయణ సవాల కృష్ణమూర్తి ఇటుకూరి వీరయ్య గుప్తా రెమద్దుల జ్యోతి బాబు బులియన్ మర్చంట్ సంఘం వారు సహకరిస్తున్నారని ఆలయ పూజారి తెలిపారు వచ్చే నెల 4 న శ్రీ దత్త జయంతి సందర్భంగా శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం దత్తాత్రేయ స్వామి ఆలయం లో జేరిగే పూజల కు వనపర్తి పరిసర గ్రామాల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారి కృపకు పాత్రులై తీర్థ ప్రసాదాలు అన్న ప్రసాదం స్వీకరించాలని ఆలయ పూజారి కోరారు
