రంజాన్.. మసీదుల్లో ఈద్గా లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
జహీరాబాద్. నేటి ధాత్రి:
పరోపకారానికి, సహనానికి ప్రతీకగా నిలిచే రంజాన్ పర్వదినాన్ని జహీరాబాద్ ఝరాసంగం మొగుడంపల్లి న్యాల్కల్ కోహిర్ మండలంలో ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో రంజాన్ పండుగ శుభాకాంక్షలు జరుపుకున్నారు ముస్లింల పవిత్ర పండుగ అయిన రంజాన్‌ను భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ఆయా గ్రామాలలో ఆవరణలో ఉన్న మసీదులో ఈద్గా లో ఉన్న ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.రంజాన్ పురస్కరించుకుని గ్రామాలలోని మసీదులు కొత్త కలను సంతరించుకున్నాయి. కాగా, రంజాన్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేశారు.

మహ్మద్ ప్రవక్త ద్వారా అల్లాహ్ తరపున ఖురాన్ గ్రంథం లిఖించినందుకు కృతజ్ఞతగా ముస్లింలు నెల రోజులు ఉపవాస దీక్షలు పాటిస్తూ. జీవన గ్రంథమైన ఖురాన్‌కు అనుగుణంగా జీవితాన్ని తీర్చిదిద్దుకునేందుకు దేవుడు నెల రోజులపాటు ఉపవాసాలు నిర్ణయించాన్నది ముస్లింల నమ్మకం. కోపం, మదం, మోహం, అవినీతి, అహంకారం, దౌర్జన్యం లాంటి దుర్గుణాలను త్యజించాలని బోధించేదే రంజాన్ మాసం.అల్లా దీవెనలతో మన భారతదేశ ప్రజలందరూ జహీరాబాద్ నియోజకవర్గం ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని, ప్రజలంతా కలిసిమెలిసి సుఖ సంతోషాలతో జీవించాలని ప్రార్థించారు.