
Sri Ketaki Sangameshwara Temple
సంగమేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు
జహీరాబాద్ నేతి ధాత్రి:
దక్షిణ కాశీగా పిలిచే ఝరాసంగంలోని శ్రీ కేతకి సంగమేశ్వర దేవాలయంలో సంగమేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆషాఢ మాసం కృష్ణపక్షం, బహుళ దశమి పురస్కరించుకొని పార్వతి సహిత సంగమేశ్వర స్వామికి పంచామృతాలతో అభిషేకం చేశారు. సహస్రనామాలు, కుంకుమార్చన, బిల్వార్చన తదితర పూజలతో మంగళహారతి చేశారు. సోమవారం కావడంతో దూరప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకుని తమ మొక్కులను చెల్లించుకున్నారు.