శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలుబీ
వనపర్తి నేటిధాత్రి .
వనపర్తి జిల్లా కేంద్రంలో శంకర్ గంజ్ లో శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు మంగళవారం ఉదయం ఉత్తర ద్వారా దర్శనం భక్తులకు ఆలయ కమిటీ నిర్వాహకులు కల్పించారు .ఈ సందర్భంగా ప్రత్యేక పూజలో ఆలయ కమిటీ నిర్వాహకులు దాచ లక్ష్మీనారాయణ దాచ శివకుమార్ న్యాయవాది దార వెంకటేష్ క్రాంతి ట్రాన్స్పోర్ట్ విజయ్ నూకల రామకృష్ణ లగిశెట్టి శ్రీకాంత్ ఈపూరి వెంకటేష్ గోనూర్ రాజు నుకల నాగరాజు 33 వ వార్డు మాజీ మున్సిపల్ కౌన్సిలర్ జర్నలిస్ట్ పొలిశెట్టి సురేష్ తిరుమల్ శంకర్ గంజ్ ఆలయ కమిటీ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఆలయ పూజారి చల్ల వెంకటేశ్వర్ల శర్మ భక్తులకు అర్చనలు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ నిర్వాహకులు మాట్లాడుతూ శ్రీ లక్ష్మీనరసింహ ఆలయంలో ప్రతినెల స్వాతి నక్షత్రం లో ప్రత్యేక పూజలు పల్లకి సేవ రాత్రి ఉంటుందని వారు పేర్కొన్నారు శంకర్ గంజ్ శ్రీలక్ష్మి నరసింహస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి కృపకు పాత్రులు కావాలని వారు కోరారు
