చెన్నూర్, నేటి ధాత్రి:
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రివర్గ విస్తీర్ణంలో భాగంగా చెన్నూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి రావాలని శనివారం రోజున కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు చెన్నూరు క్యాంప్ ఆఫీసులో గణనాధునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుండి ప్రతిరోజు నియోజకవర్గంలో పర్యటిస్తూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ పరిష్కారాన్ని చూపిస్తూ, నూతనంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను మొదలుపెట్టి నిర్విఘ్నంగా జరిపిస్తూ నిరంతరం నియోజకవర్గ అభివృద్ధి కోసం శ్రమిస్తున్న చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకట స్వామికి తప్పకుండా మంత్రి పదవి దక్కాలని తద్వారా ఇంకా మెరుగైన పాలన చేయడానికి వీలవుతుందని అందుకోసం ఆ గణనాధుని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకట స్వామికి మంత్రి పదవి తప్పకుండా వచ్చేలా చూడాలని వేడుకోవడం జరిగిందని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. అనంతరం అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.