
ఎండపల్లి,(జగిత్యాల) నేటి ధాత్రి,
ప్రతీ ఇంటికి సంక్షేమ పథకాలు అందించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని భారాస పార్టీ సీనియర్ నాయకుడు రామిళ్ల సనిల్ అన్నారు.బుధవారం రోజున వెల్గటూర్ మండలం చెగ్యాం గ్రామంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,ధర్మపురి నియోజక వర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ను అధిక మెజార్టీతో గెలిపించుకోవాలని ప్రజలను కోరారు. అనంతరం గ్రామంలోని హనుమాన్ ఆలయంలో ధర్మపురి నియోజక వర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ భారీ మెజార్టీ గెలవాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు రామిల్ల సనిల్,హనుమండ్ల ప్రసాద్, షేక్ దస్తగిర్, ఆవుల అనిల్, తోట నాగరాజు, రామ్ రెడ్డి, కునమల్ల లింగయ్య, తదితరులు పాల్గొన్నారు.