స్పెషల్ ఆఫీసర్లు సమర్థవంతంగా విధులు నిర్వహించాలి

జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా

గ్రామ పంచాయతీలలో అన్ని అంశాలపై పూర్తి అవగాహన పెంపొందించు కోవాలి

గ్రామాలలో నీటి ఎద్దడి లేకుండా ప్రత్యేక దృష్టి సారించాలి

భూపాలపల్లి నేటిధాత్రి

గ్రామ పంచాయతీలలో నూతనంగా నియమితులైన స్పెషల్ ఆఫీసర్లు సమర్ధవంతంగా విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ భావేష్ మిశ్రా అన్నారు.జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టర్ కార్యాలయం నుండి శుక్రవారం జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అన్ని మండలాల స్పెషల్ ఆఫీసర్లతో, ఎంపీడీవోలు, తాసిల్దారులు గ్రామపంచాయతీ స్పెషల్ ఆఫీసర్ల తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా మాట్లాడుతూ ..గ్రామ పంచాయతీలలో సర్పంచుల పదవీకాలం ముగియడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతి గ్రామ పంచాయతీకి స్పెషల్ ఆఫీసర్లను నియమించడం జరిగిందని భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా 241 గ్రామపంచాయతీ లలో స్పెషల్ ఆఫీసర్లు నేటి నుండి విధుల్లో చేరగా స్పెషల్ ఆఫీసర్లు గ్రామ పంచాయతీలలో చేయవలసిన పనుల గురించి అవగాహన కలిగి ఉండాలన్నారు.
స్పెషల్ ఆఫీసర్ల విధి విధానాలను తెలిపే ప్రత్యేక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ను ప్రతి స్పెషల్ ఆఫీసర్ కు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పంపించడం జరిగిందని. దానికి అనుగుణంగా ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో గల స్పెషల్ ఆఫీసర్లు గ్రామ పంచాయతీలోని ప్రతి రికార్డు, బడ్జెట్ శానిటేషన్ , జాబ్ కార్డులు ,పెన్షనర్స్ , మిషన్ భగీరథ, నరేగా లాంటి అనేక అంశాలపై పూర్తి అవగాహన పెంపొందించుకోవాలని పేర్కోన్నారు.
గ్రామపంచాయతీ స్పెషల్ ఆఫీసర్,పంచాయతీ సెక్రెటరీ, ఎం.పీ.ఓ., ఎంపీడీవో, మండల ప్రత్యేక అధికారులతో సమన్వయం తో ప్రతి 15 రోజులు లేదా నెల రోజులకు ఒకసారి గ్రామసభలు నిర్వహించి మార్చి నెల వరకు పూర్తి స్థాయిలో అన్ని గ్రామాలలో ఇంటి పన్నులు వసూలు చేయాలనీ కొన్ని గ్రామాలలో ప్రత్యేకంగా నిర్వహించే జాతరలకు,వారాంతపు సంతలకు పెండింగ్లో ఉన్న టెండర్లను నిర్వహించి గ్రామపంచాయతీలకు ఆదాయాన్ని చేకూర్చాలన్నారు.
గత సర్పంచుల పదవీకాలంలో ఉపయోగించిన క్యాష్ బుక్ ,చెక్ బుక్ ,ఎం.బి రికార్డులను పంచాయతీ సెక్రటరీలు జాగ్రత్తగా భద్రపరచాలన్నారు. గ్రామపంచాయతీ ఎన్నికలు వచ్చేవరకు గ్రామాలలో ప్రత్యేక అధికారుల పాలన నడుస్తుందని సర్పంచులకు ఉండే పూర్తి బాధ్యతలు స్పెషల్ ఆఫీసర్లకు ఉంటాయన్నారు.
రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా నీటి సరఫరా చేయాలన్నారు.గ్రామ పంచాయతీ పరిధిలోని వాటర్ ట్యాంకులు, బోర్ వెల్స్, నల్లా కనెక్షన్లు, మిషన్ భగీరథ ద్వారా త్రాగునీరు అందించాలని తెలిపారు.
గ్రామాలలో లీకేజీలు ఉన్న పైపులైన్లను గుర్తించి మిషన్ భగీరథ, ఆర్. డబ్ల్యూ.ఎస్ శాఖలను సమన్వయ పరుస్తూ పైప్ లైన్ల లీకేజీలను అరికట్టి నల్ల కలెక్షన్ లేని ఇళ్లకు నూతన నల్ల కలెక్షన్ ఏర్పాటుచేసి త్రాగునీరు సరఫరా చేయాలన్నారు.
గ్రామాలలోని ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకులను ప్రతి 10 రోజులకు ఒకసారి శుభ్రపరుస్తూ , క్లోరినేషన్ జరపాలని రిపేర్ లో ఉన్న హ్యాండ్ పంపులకు, బోర్ వెల్ లకు మరమ్మతులు చేయించి, ఓపెన్ బోర్లకు సేఫ్టీ చర్యలు చేపట్టి పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచాలన్నారు.
వేసవికాలంలో నీటి ఎద్దడి ఉండే గ్రామాలలో, కాలనీలలో ప్రత్యేక వాటర్ ట్యాంకర్ ల ద్వారా త్రాగు నీటిని సరఫరా చేయాలన్నారు.
గత సంవత్సరం హరితహారం లో నాటిన మొక్కలను సంరక్షిస్తూ చనిపోయిన మొక్కల జాబితాను తయారు చేయాలన్నారు.
ఎం.పీ.డీ.వో.ల ద్వారా డిజిటల్ కి తీసుకోవాలని గ్రామాలలో ఎలాంటి సమస్య ఉన్న స్థానిక ఎం.పీ.డీ.వోలకు ,డి.పి.ఓ కు ,జిల్లా కలెక్టర్ కు సమాచారం అందించాలన్నారు.15 రోజుల తర్వాత స్పెషల్ ఆఫీసర్లతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి గ్రామాలలో స్వయంగా పర్యటిస్తూ మండల కేంద్రాల సైతం మీటింగ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు.
ఈ సమావేశం లో అదనపు కలెక్టర్ కే. వెంకటేశ్వర్లు, జిల్లా పంచాయితీ అధికారి ఆశా లత, మండల ప్రత్యేక అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *