
రామాయంపేట (మెదక్) నేటి ధాత్రి.
రామాయంపేట మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలో మెదక్ ఆర్డీఓ రమాదేవి శుక్రవారం రోజు ఉదయం మండల అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రామాయంపేట మండలంలోని కళ్యాణ లక్ష్మి లబ్ధిదారుల అప్లికేషన్లను పరిశీలించినట్లు తెలిపారు.అదే విధంగా ధరణిలో ఉన్న భూ రికార్డులను ఆమె పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నట్లు పేర్కొన్నారు.అదే మాదిరిగా మండల సిబ్బంది రికార్డులను మరియు వారు చేస్తున్న పని విధానాన్ని తెలుసుకున్నట్లు తెలిపారు.రామాయంపేట పట్టణంలో ఎల్కతుర్తి బైపాస్ రోడ్డు పనులు ఎక్కడి నుండి ఎక్కడి వరకు చేస్తున్నారన్న విషయంలో అక్కడ రోడ్డు సిబ్బందిని ఆర్డీవో అడిగి తెలుసుకున్నట్లు తెలిపారు. విద్యార్థులకు డేట్ అఫ్ బర్త్ సర్టిఫికెట్లు కూడా ఏ విధంగా విద్యార్థుల తల్లిదండ్రులకు అందజేయాలనే విషయంలో మండల అధికారులకు ఆమె సలహాలు సూచనలు ఇచ్చినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో మండల తహసిల్దార్ రజనీకుమారి మండల సిబ్బంది పాల్గొన్నారు.