
గుడివాడ శ్రీహరి మంగపేట మండలం బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఇంచార్జ్
మంగపేట నేటి ధాత్రి
ములుగు జిల్లా మంగపేట మండలంలో గల గ్రామాలల్లో వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు పడకుండా వైద్య సిబ్బంది ముందస్తు జాగ్రత్తలు తీసుకోని గ్రామాలల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చెయ్యాలని బీఆర్ఎస్ మంగపేట మండలం సోషల్ మీడియా ఇన్చార్జి గుడివాడ శ్రీహరి అన్నారు.వారు మాట్లాడుతూ.వర్షాకాలం వచ్చింది అంటేనే గ్రామాలల్లో సీజనల్ వ్యాధులు మలేరియా,డెంగ్యూ జబ్బులు విజృంభిస్తాయని అన్నారు. గ్రామాలల్లో ప్రజలు జబ్బుల బారిన పడకుండా వైద్య శిబిరాలు గ్రామల్లో ఏర్పాటు చేయాలని అన్నారు.ఇప్పటికే వైధ్య శిబిరాలు ఏర్పాటు చెయ్యక గ్రామల్లో ఉన్న ప్రజలు జబ్బుల బారిన పడి ఆర్ఎంపి వైద్యుల వద్ద,ప్రైవేట్ హాస్పటల్లో వేలకు వేల రూపాయలు ప్రజలు ఖర్చు చేసుకోవడం జరుగుతుందని, ప్రభుత్వ అధికారులు స్పందించి వెంటనే ప్రతి గ్రామం లో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి,వైద్య పరీక్షలు నిర్వహించి ప్రజలకు మందులు అందించి ప్రజలు వర్షాకాలం సీజనల్ వ్యాధుల పట్ల పడకుండా కాపడాలని అన్నారు.