వనపర్తి జిల్లాలో పెండింగ్ లో ఉన్న కేసుల పరిష్కారం కొరకు ఈనెల 15న లోక్ అదాలత్
సీనియర్ సివిల్ జడ్జి శ్రీమతి రజిని
వనపర్తి నేటిదాత్రి .
వనపర్తి జిల్లాలో కోర్టులలో పెండింగ్ లో ఉన్న కేసుల పరిష్కారం కొరకు ఈనెల 15న ప్రత్యేక లోక్ అదాలత్ తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవా సంస్థ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్నామని సీనియర్ సివిల్ జడ్జ్ శ్రీమతి రజిని ఒక ప్రకటనలో తెలిపారు . జిల్లాలోని కేసులు పెండింగ్ లో ఉన్న కక్షిదారులు వినియోగించుకోవాలని క్రిమినల్ చెక్ బోన్స్ మెయింటెనెన్స్ గృహ హింస ప్రైవేట్ బీమా వివాదాలు ఆస్తి విభజన కుటుంబ వివాదాలు వనపర్తి జిల్లాలో పెండింగ్లో ఉన్న కేసులు ఉన్న కక్షిదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సీనియర్ సివిల్ జడ్జి కోరారు ఈ సమావేశంలో జూనియర్ సివిల్ జడ్జి కార్తీక్ రెడ్డి డి.ఎస్.పి వెంకటేశ్వరరావు కోర్టు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు
