Pawan Kalyan's
అడవి తల్లి బాటపై ప్రత్యేక ఫోకస్.. అధికారులకు పవన్ కళ్యాణ్ సూచనలు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రోడ్ల నిర్మాణంపై నిరంతర పర్యవేక్షణ చేయాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. రెండు వారాలకు ఒకసారి శాఖాపరంగా సమీక్షించి నిర్మాణ పురోగతిపై నివేదిక ఇవ్వాలని పేర్కొన్నారు.
అమరావతి: రాష్ట్ర పంచాయతీరాజ్ అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. గిరిజన ప్రాంతాల్లో ‘అడవి తల్లి బాట’ పేరిట చేపట్టిన నూతన రహదారుల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ఆయన సూచించారు. పనులు పూర్తయితే 625 గిరిజన ఆవాసాలకు మెరుగైన రహదారి సౌకర్యం ఏర్పాటవుతుందని తెలిపారు.
