
# ఐదు గ్రామాలకు అందుబాటులో కంటైనర్ ఆసుపత్రి.
# తెలంగాణ రాష్ట్రం కొనే తొలి కంటైనర్ ఆసుపత్రి ఆరోగ్య కేంద్రంను ప్రారంభించిన మంత్రి
# రాష్ట్ర పంచాయతీ రాజ్ , గ్రామీణ అభివృద్ధి , గ్రామీణ నీటి సరఫరా మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క.
ములుగు జిల్లా నేటిధాత్రి
ములుగు జిల్లా తాడ్వాయి మండలం పోచాపూర్ గ్రామాలలో లో ఏర్పాటు చేసిన తొలి కంటైనర్ ఆసుపత్రి ఆరోగ్య ఉపకేంద్రం ని మంత్రి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్ ఎస్పీ శబరీష్ , అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు పి.శ్రీజ లతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ ప్రాంతంలో గుట్టలపై ఐదు గ్రామాల ప్రజలు నివాసిస్తున్నారని , ఆరోగ్య సమస్యలు వస్తె అనేక ఇబ్బందులు పడుతున్నారని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్ ప్రత్యేక చొరవ తో రాష్ట్రంలోని తొలి కంటైనర్ ఆసుపత్రిని ఏర్పాటు చేశామని తెలిపారు నాలుగు పడకల కోసం సుమారు రూ.7 లక్షల వ్యయంతో దీన్ని రూపొందింమని రెండు రోజుల క్రితం హైదరాబాదు నుంచి ప్రత్యేక వాహనంలో తీసుకొచ్చి పోచాపూర్ గ్రామం లో ఏర్పాటు చేశామని అన్నారు ఈ కంటైనర్ ఆసుపత్రిలో అత్యవసర చికిత్స నిమిత్తం నాలుగు బెడ్స్ , మందులు ఏర్పాటు చేశామని ఒక ఏఎన్ఎం ఒక ఆశా కార్యకర్త విధులు నిర్వర్తిస్తారని పేర్కొన్నారు.
అనంతరం మంత్రి అనసూయ సీతక్క , జిల్లా కలెక్టర్ పోచపూర్ లోని గురుకులం ను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క విద్యార్థులతో మాట్లాడుతూ ప్రభుత్వం అందించే ఏకరూప దుస్తులు పాఠ్యపుస్తకాలు అందుతున్నాయా లేదా అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలని పిల్లలకు అందించే ఆహారంలో నాణ్యత పాటించాలని ఉపాధ్యాయులకు సూచించారు