హసన్ పర్తి/ నేటి ధాత్రీ
హన్మకొండ జిల్లా హసన్ పర్తి మండలం ఎర్రగట్టు గుట్ట సమీపంలోని కెనాల్ దగ్గర హన్మకొండ ట్రాఫిక్ సి ఐ సీతారెడ్డి స్పెషల్ డ్రైవ్ నిర్వచించారు. హెల్మెట్ ధరించని లైసెన్స్ లేని వాహనాలను నంబర్ ప్లేట్ లేని 28 టూ వీలర్లను సీజ్ చేశారు.అనంతరం వాహన దారులకు పలు సూచనలు చేశారు అతి వేగంతో, డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తు వాహనాలు నడపవద్దని లైసెన్స్ లు తీసుకొని హెల్మెట్ ధరించాలని సూచించారు. ఈ స్పెషల్ డ్రైవ్ నిర్వహణలో హన్మకొండ ట్రాఫిక్ ఎసిపి భోజ రాజు, ఎస్సై యుగెందర్, మనోజ్ రెడ్డి వేణు తదితరులు ఉన్నారు.