
జైపూర్, నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలోని (ఎస్టిపిపి) సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ పరిపాలనా భవనంలో స్పెషల్ క్యాంపెయిన్ 4.0 కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్టిపిపి ఈడి (హెడ్ అఫ్ ది ప్లాంట్) ఎన్.వి.రాజశేఖర్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అధికారులందరి చేత స్వచ్ఛత ప్రతిజ్ఞ చేపించడం జరిగింది.ఈ సందర్బంగా ఈడి రాజశేఖర్ రావు మాట్లాడుతూ ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం –స్వచ్చత ను సంస్తాగతీ కరించడం మరియు మన దేశంలోని ప్రభుత్వ ఆఫీసుల్లో పెండింగ్ ఫైల్స్ ని తగ్గించడం అలాగే ఆఫీసులను పరిశుభ్రంగా ఉంచాలనే ఉద్దేశంతో ఈ స్వచ్చత కార్యక్రమాలను గత కొన్ని సంవత్సరాలుగా
పరిపాలనా సంస్కరణలు & ప్రజా ఫిర్యాదుల శాఖ (డి.ఎ.ఆర్.పి.జి) మరియు బొగ్గు మంత్రిత్వ శాఖల వారి ఆదేశాల మేరకు నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు.ప్రపంచలోని ఏ దేశంలోనైన పరిశుభ్రత కనిపిస్తుందంటే దానికి కారణం ఆ దేశ ప్రజలు దాన్ని పరిశుభ్రంగా ఉంచడమేనని అన్నారు. మనం పరిశుభ్రంగా ఉంటూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడమే కాక ఇతరులను అపరిశుభ్రత చేయనియకుండా చూడాలన్నారు. అలాగే వారానికి 2 గంటలు మరియు సంవత్సరంలో 100 గంటలు పరిశుభ్రతకు కేటాయిస్తే పరిశుభ్ర తెలంగాణ తద్వారా స్వచ్చ భారత్ సాధ్యమవుతుందన్నారు.
ఈ కార్యక్రమములో జీ.ఎం.(పిసిఎస్) శ్రీనివాసులు, ఏఐటియుసి పిట్ సెక్రెటరి సత్యనారాయణ,సీఎంఓఏఐ ప్రెసిడెంట్ సముద్రాల శ్రీనివాస్, ఎ.జీ.ఎం (సివిల్) ప్రసాద్, ఏజీఎం (ఫైనాన్స్) టి.సుధాకర్,ఎ.జీ.ఎం(ఈ అండ్ ఎం)మదన్ మోహన్, డిజిఎం (పర్యావరణం)వాసుదేవ మూర్తి, ఎస్వోటు ఈడి ప్రభాకర్, సీనియర్ పర్సనల్ ఆఫీసర్ ఠాకూర్ మోహన్ సింగ్,ఇతర అధికారులు మరియు ఉద్యోగులు పాల్గొన్నారు.