ప్రారంభించిన కొత్తగూడెం ఏరియా జిఎం సాలెం రాజు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి
కొత్తగూడెం సింగరేణి.సెక్రటరీ మినిస్ట్రీ ఆఫ్ కోల్ ఆదేశానుసారం సింగరేణి వ్యాప్తంగా స్పెషల్ కంపెయిన్ 4.0 రెండవ దశ కార్యక్రమంను నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు కొత్తగూడెం ఏరియాలోని రుద్రంపూర్ ఎస్.బి.ఐ బ్యాంక్ లైన్ నందు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏరియా జనరల్ మేనేజర్ ఎం.షాలేం రాజు హాజరుకావడమైనది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన సంస్ధ సి&ఎండి ఎన్ బలరాం. దిశా నిర్దేశాలతో సింగరేణి వ్యాప్తంగా ఈ నెల సెప్టెంబర్ 16 వ తేదీ నుండి సెప్టెంబర్ 30 వ తేదీ వరకు ప్రిపరెటరీ ఫేస్ (సన్నాహక దశ) స్వచ్చతా పై వివిధ కార్యక్రమానికి పిలుపు నిచ్చారని అందులో భాగంగా కొత్తగూడెం ఏరియాలోని అన్ని గనులు, డిస్పెంసరీలలో,డిపార్ట్మెంట్లలో, ఆఫీసులలో స్వచ్ఛత, పరిసరాల పరిశుభ్రత కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు.
ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం క్లీన్లైన్స్ ఆఫ్ సైట్స్ ఫర్ స్పేస్ మేనేజ్మెంట్ అండ్ బ్యూటీఫికేషన్ ఆఫ్ ఆఫీసెస్ (క్లీన్లైనెస్ అఫ్ సిట్స్ ఫర్ స్పేస్ మానేజ్మెంట్ & బ్యూటిఫికేషన్ అఫ్ ఆఫసెస్ ) అని తెలియజేసారు. అనంతరం అక్టోబర్ మాసం 2వ తేదీ నుండి 31వ తేదీ వరకు ఇంప్లిమెంటేషన్ పేస్ (ఆచరణ దశ) గా వివిధ స్వచ్ఛత కార్యక్రమాలు చేయడం జరుగుతుందన్నారు అందులో భాగంగా ఈరోజు రుద్రంపూర్ ఎస్.బి.ఐ బ్యాంక్ లైన్ నందు ఈ స్వచ్ఛత కార్యక్రమం నిర్వహిస్తున్నామని, అధికారులు అందరితో కలిసి పిచ్చి మొక్కలను తొలగించి శుభ్రం చేశారు అలాగే అందరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని అలాగే వారి ఇంటి యందు, పనిచేసే స్థలాలు, కార్యాలయాల యందు మరియు చుట్టుపక్కల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, చెట్లను పెంచాలని తద్వారా పర్యావరణమును సమతుల్యం అవుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమం ద్వారా పని వద్ధ, ఇంటి వద్ధ పరిశుభ్రత పాటించాలని, ప్లాస్టిక్ నివారణ, ప్రచారము వంటి మొదలుగు స్వచ్ఛత కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. అలాగే స్వచ్ఛత గురించి వివరించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో కొత్తగూడెం ఏరియా జిఎం.తో పాటు ఏఐటియుసి యూనియన్ ప్రతినిధి వీరయ్య, ఐఎన్టియుసి వైస్ ప్రెసిడెంట్ ఎండి రజాక్, జిఎం ఆఫీస్ ఫిట్ సెక్రటరీ సిహెచ్ సాగర్, ఎస్ ఓ టు జిఎం జీవి కోటిరెడ్డి, ఎజిఎం (సివిల్) సిహెచ్ రామకృష్ణ, డిజిఎం (పర్సనల్) బి. శివ కేశవరావు, అధికారులు ఎస్. సదానందం, ఎన్.యోహన్, ఎం.మురళి, అచ్యుతరామయ్య, బి మాధవ్, కే.శేషాశ్రీ, బి.తౌర్య ఇతర అధికారులు మరియు కాంట్రాక్ట్ పారిశుద్ధ్య సిబ్బంది పాల్గొన్నారు.