డిపో మేనేజర్ ప్రసూన లక్ష్మీ
నర్సంపేట,నేటిధాత్రి :
నర్సంపేట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు నర్సంపేట ఆర్టీసీ బస్ డిపో శుభవార్త తెలిపింది. ఈ నెల 20 శుక్రవారం సాయంత్రం నర్సంపేట నుండి 23 తేదీ సోమవారం వరకు 4 రోజులు అరుణాచలం గిరి ప్రదక్షనకు 36 సీట్లు గల సూపర్ లగ్జర్ బస్సును ప్రారంభించనున్నట్లు నర్సంపేట డిపో మేనేజర్ ప్రసూన లక్ష్మీ ఒక ప్రకటనలో తెలియజేసారు.నర్సంపేట నుండి బీచుపల్లి హనుమాన్ టెంపుల్,జోగులాంబ అమ్మవారి టెంపుల్ ,కాణిపాకం వినాయక టెంపుల్,వెల్లూరు గోల్డెన్ టెంపుల్,అరుణాచలం గిరి ప్రదక్షణ దర్శనాల అనంతరం తిరుగు ప్రయాణం కలదన్నారు.కావున ఈ సదావకాశాన్ని నర్సంపేట పరిసర ప్రాంతాల ప్రజలు వినియోగించుకోగలరు అని కోరారు.మరిన్ని వివరాల కోసం 9959226052,8919313229 , 9989038476 ఫోన్ నంబర్లు సంప్రదించగలరని డిపో మేనేజర్ ప్రసూన లక్ష్మి తెలిపారు.