గణేష్వరునికి ప్రత్యేక అభిషేకం జిల్లా జడ్జి రమేష్ బాబు
అద్భుత శిల్ప సంపద కోట గుళ్ళు దేవాలయం
శిల్ప సంపదను భావితరాలకు అందించాలి
జిల్లా జడ్జి రమేష్ బాబు, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి అఖిల
గణపురం నేటి ధాత్రి
గణపురం మండల కేంద్రంలో అద్భుత శిల్ప సంపద కోట గుళ్ళు దేవాలయమని
ఆలయ శిల్ప సంపదను భావితరాలకు అందించాలని భూపాలపల్లి
జిల్లా జడ్జి రమేష్ బాబు, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి గంగినేని అఖిల లు అన్నారు. ఆలయ అర్చకులు జూలపల్లి నాగరాజు వారిని సాదరంగా ఆహ్వానించారు. శనివారం శని త్రయోదశి పర్వదినాన్ని పురస్కరించుకొని జడ్జిలు వారి కుటుంబ సభ్యులతో కలిసి గణపతి, నందీశ్వరుడికి పట్టు వస్త్రాలు సమర్పించి గణపేశ్వరునికి ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం జడ్జిల ను కోటగుళ్లు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో శాలువాలు పూలమాలలతో ఘనంగా సన్మానించి ఆశీర్వచనాలు తీర్థ ప్రసాదాలను అందజేశారు.

వీరి వెంట జడ్జి అఖిల తల్లిదండ్రులు గంగినేని పద్మావతి శ్రీనివాసరావు దంపతులు ఉన్నారు. జిల్లా జడ్జి రమేష్ బాబు
గోశాల గోమాతలకు రూ 10 వేలతో దానా బస్తాలను అందజేశారు. గోశాల గోమాతలకు దాన బస్తాలను అందజేసిన జడ్జి కుటుంబ సభ్యులకు కోటగుళ్లు పరిరక్షణ కమిటీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.
