
Special Aadhaar Camp in Kogileru
కోగిలేరులో ప్రత్యేక ఆధార్ క్యాంపు
పెద్దపంజాణి(నేటి ధాత్రి)
అగస్టు 21:
చిత్తూరు జిల్లా
పెద్దపంజాణి
మండలంలోని కోగిలేరు సచివాలయంలో శుక్రవారం ప్రత్యేక ఆధార్ క్యాంపు ఏర్పాటు చేశారు. కోగిలేరు సమీపంలోని యానాది కాలనీవాసులకు కొంతమందికి ఆధార్ కార్డులు లేకపోవడంతో ఇటీవల స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు యానాది కాలనీవాసులకు ఆధార్ కార్డులు మంజూరు చేయాలని తహశీల్దార్ హనుమంతు, డిప్యూటీ ఎంపీడీవో శారదాదేవికి విన్నవించడంతో స్పందించిన అధికారులు యానాది కాలనీలో పర్యటించి ఆధార్ కార్డులపై ఆరా తీశారు.ఈ సందర్భంగా పిల్లలకు జనన ధృవీకరణ పత్రాలు లేని కారణంగా ఆధార్ కార్డులు ఇప్పటి వరకు మంజూరు కాలేదని గుర్తించి ఇప్పటికే కొందరు జనన ధృవీకరణ పత్రాలను పొంది వుండగా 5మంది పిల్లలకు జనన ధృవీకరణ పత్రాలను పంపిణీ చేశారు. వీరికి సచివాలయంలో ప్రత్యేక ఆధార్ క్యాంపు ద్వారా ఆధార్ కార్డులు తీయాలని తహశీల్దార్ ఆదేశించడంతో ప్రత్యేక ఆధార్ క్యాంపు ఏర్పాటు చేసి ఆధార్ కార్డులు తీశారు. అలాగే జనన ధృవీకరణ పత్రాలు లేని వారి వివరాలు ఉన్నతాధికారులకు నివేదికలు పంపామని, అక్కడ నుండి ఆదేశాలు జారీ అయ్యాక వారికి జనన ధృవీకరణ పత్రాలతో పాటు ఆధార్ కార్డులు కూడా మంజూరు చేయనున్నట్లు తహశీల్దార్ హనుమంతు, డిప్యూటీ ఎంపీడీవో శారదాదేవి తెలిపారు. ఈ ఆధార్ క్యాంపులో సర్పంచ్ రమేష్ బాబు, వీఆర్వో శివకుమార్, డిఏలు జ్యోతి స్వరూప్, సాయికార్తీక్ తదితరులు పాల్గొన్నారు.