
భూపాలపల్లి నేటిధాత్రి
గత 30 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టు నేత మచ్చ సోమయ్య సన్నాఫ్ సమ్మయ్య కుటుంబాన్ని జయశంకర్ భూపాలపల్లి ఎస్పీ కిరణ్ ఖరే సందర్శించారు.
భూపాలపల్లి మండలం పంబాపూర్ గ్రామానికి చెందిన అజ్ఞాత మావోయిస్టు, మచ్చ సోమయ్య, ఇంటికి వెళ్లి ఆయన భార్య సుగుణమ్మకు దుప్పట్లు, మెడికల్ కిట్, నిత్యవసర వస్తువుల సరుకులను ఎస్పి అందజేసి, అజ్ఞాత మావోయిస్టు కుటుంబ సభ్యులతో ఆప్యాయంగా మాట్లాడి, వారి జీవనోపాధి, కుటుంబ పరిస్థితి, కుటుంబ నేపథ్యం, పిల్లల పరిస్థితి, వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. సోమయ్య కుటుంబ సభ్యులకు ఏలాంటి సమస్యలు ఎదురైన అవసరమైన వైద్య చికిత్సలు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఎస్పీ కిరణ్ ఖరే పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఎస్పీ కిరణ్ ఖరే మాట్లాడుతూ.. మచ్చ సోమయ్య సమ్మయ్య అడవి వీడి జనంలోకి రావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ పోలీసుల నిఘా పటిష్ఠంగా ఉందని, ఇప్పటికే తెలంగాణకు చెందిన అనేక మంది మావోయిస్టులు ఎన్కౌంటర్ లలో హతమయ్యారని అన్నారు. అజ్ఞాత జీవితం గడుపుతున్న మావోయిస్టులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని,
సోమయ్య ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో కలిస్తే, ఆయనపై ఉన్న రివార్డ్ ప్రభుత్వం నుంచి అనేక ప్రయోజనాలు అందేలా కృషి చేస్తామని ఎస్పి హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో భూపాలపల్లి అదనపు ఎస్పి బోనాల కిషన్, భూపాలపల్లి డిఎస్పి ఏ. సంపత్ రావు, సిఐ నరేష్ కుమార్, ఎస్సైలు సుధాకర్, రమేష్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.