వృత్తిలో ఎస్పీ భాస్కరన్..!

ప్రవృత్తిలో వైయస్ రాజశేఖర్ రెడ్డి

-ప్రోత్సాహంలో తల్లిదండ్రులు

-ఏఎస్ఐగా పదవి విరమణ చెందిన పులి వీరారెడ్డి

మొగులపల్లి నేటి ధాత్రి న్యూస్ నవంబర్ 14

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం ముల్కలపల్లి గ్రామానికి చెందిన పులి వీరారెడ్డి ఏఎస్ఐగా పదవీ విరమణ పొందారు. వృత్తిలో ఎస్పీ భాస్కరన్, ప్రవృత్తిలో వైయస్ రాజశేఖర్ రెడ్డిని ఎంచుకున్న ఆయన 2019లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. మొగుళ్లపల్లి మండలం ముల్కలపల్లి గ్రామంలో జులై 10 1961లో పులి సూర్యమ్మ-బుచ్చి రాజిరెడ్డి దంపతులకు సంతానంగా జన్మించారు. 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు ముల్కలపల్లి గ్రామంలోని ప్రైమరీ పాఠశాలలో, 6 నుంచి 10 వరకు జడ్పీహెచ్ఎస్ మొగుళ్ళపల్లిలో విద్యనభ్యసించారు. జమ్మికుంట లో ఇంటర్, డిగ్రీ పూర్తి చేశారు. ఫిబ్రవరి 1 1984న కానిస్టేబుల్ గా ఉద్యోగం సాధించారు. 1984న సుబేదారి పోలీస్ స్టేషన్ లో పోస్టింగై 1989 వరకు అక్కడ విధులను నిర్వర్తించారు. 1989లో మట్టేవాడకు బదిలై 1993 వరకు పని చేశారు. 1993లో సిసిఎస్ మట్టేవాడ పోలీస్ స్టేషన్ కు బదిలై 1997 వరకు అక్కడ విధులను నిర్వర్తించారు. 1997 నుంచి ఆర్ సి సి ఎస్ కు బదిలై 2001 వరకు అక్కడ పని చేశారు. 2001 నుంచి కాజీపేటలో స్పెషల్ డ్యూటీలో చేరి 2003 వరకు అక్కడ పని చేశారు. 2003 నుంచి ఇంతేరాగంజ్ పోలీస్ స్టేషన్ లో క్రైమ్ డిపార్ట్మెంట్ లో 2007 వరకు పని చేశారు. 2007లో హెడ్ కానిస్టేబుల్ గా ప్రమోషన్ పొంది పరకాల పరిధిలోని శాయంపేట పోలీస్ స్టేషన్ లో క్రైమ్ డిపార్ట్మెంట్ లో 2011 వరకు పనిచేశారు. మళ్లీ 2011లో సుబేదారి పోలీస్ స్టేషన్ కు బదిలై 2016 వరకు అక్కడ పని చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా విభజన అనంతరం 2016లో ఏఎస్ఐ గా ప్రమోషన్ పొంది భూపాలపల్లికి బదిలీపై వచ్చే సిసిఎస్లో 2019 వరకు పని చేసి రిటైర్మెంట్ అయ్యారు. తన ఉన్నతికి తల్లిదండ్రుల ప్రోద్బలమే కారణంగా ఆయన చెప్పడం గమనార్హం. తనకు వృత్తిలో ప్రోత్సాహాన్నిచ్చిన ఎస్పీ భాస్కరన్, రాజకీయంగా తనకు నచ్చిన నాయకుడిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ఆయన ఆదర్శంగా చెబుతున్నారు. ప్రస్తుతం ఆయన ఉమ్మడి వరంగల్ జిల్లా రిటైర్డ్ పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షులుగా, వికాస్ నగర్ కాలనీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. కానిస్టేబుల్ గా పనిచేస్తూ..ఏఎస్ఐగా రిటైర్డ్ అయ్యేవరకు 132 అవార్డులు పొందడం అతని కీర్తికి నిదర్శనం. టిడిపి ప్రభుత్వ హాయంలో ఆయన సేవలను గుర్తించిన హోం మినిస్టర్ ఎలిమినేటి మాధవరెడ్డి నగదు బహుమతిని అందించి సత్కరించడం గమనార్హం. రిటైర్డ్ పోలీస్ అధికారుల సంఘం పక్షాన పెన్షన్ వైద్య మరియు ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీలపై పోరాటం చేస్తూ..రిటైర్డ్ పోలిస్ అధికారుల మన్ననలను పొందుతున్నారాయన. ఒక కోటి 50 లక్షల రూపాయల విరాళాలను సేకరించి కనివిని ఎరుగని రీతిలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ను నిర్మించి వికాస్ నగర్ కాలనీవాసుల అభిమానాన్ని చూరగొంటున్న ఆయన ప్రస్తుతం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించడమే లక్ష్యంగా తన ప్రణాళికలను రూపొందించుకుంటూ ముందుకెళుతున్నారు. ముఖ్యంగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావును భారీ మెజార్టీతో గెలిపించేందుకు తనదైన శైలిలో ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!