Soybean Purchase Center Opened at Zharasangam PACS
పీఏసీఎస్ ఝరాసంగం సొసైటీ లో సోయాబీన్ కొనుగోలు కేంద్రం ప్రారంభం
జహీరాబాద్ నేటి ధాత్రి:
సోయ కోనుగోలు కేంద్రం పీఏసీఎస్ ఝరాసంగం అధ్యక్షులు మొహమ్మద్ గౌసోద్దిన్ ప్రారంభించడం జరిగింది ఆయన మాట్లాడుతూ రైతులు తమ సోయాబిన్ ను శుభ్రపరుచుకోని, నాణ్యత ప్రమాణాలు పాటించి,కావలసిన ధృవపత్రాలు ఆధార్ కార్డ్, భూమి పట్టా పాస్ బుక్, బ్యాంక్ అకౌంట్, జిరాక్స్ కాపీలు తీసుకోని స్వయంగా వచ్చి ప్రభుత్వ మద్దతు ధర ప్రకారం అమ్మినట్టు అయితే రైతులు లాభాలు పొందే అవకాశం వుందని తెలిపారు. ప్రభుత్వ మద్దతు ధర కింటలుకు రూ .5328/- రైతుల ఖాతాలలో జమ చేయడం జరుగుతుందని అన్నారు. ఇట్టి కార్యక్రమంలో పిఎసిఎస్ సెక్రటరీ షేక్ నిస్సార్ అహ్మద్, కేతకి అలయ చైర్మన్ చంద్రశేఖర్, మాజీ ఎంపీపీ హన్మంత్ రావు పాటేల్, ఏఎంసీ డైరెక్టర్ అంజత్,ల్యాఖత్ అలీ అమృత్ పాటేల్, మోహన్ రెడ్డి, బశిరెడ్డి, శంకర్ గౌడ్, అష్రఫ్ అలీ, అలయ ధర్మ కర్త, శ్రీనివాస్, రవిందర్ రెడ్డి రాజేందర్ సింగ్ రైతులు మహ్మద్ కిజర్ ఖాన్ తదితరులు పాల్గన్నారు. మరియు రైతులు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలని కోరడం జరిగింది.
