భద్రాచలం నేటి ధాత్రి
పొదెం వీరయ్య చైర్మన్ తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి శాఖ కార్పొరేషన్
భద్రాచలంలో ఘనంగా సోనియాగాంధీ పుట్టినరోజు వేడుక
తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షల మేరకు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి, తెలంగాణ అభివృద్ధికి బంగారు బాటలు వేసి, దేశంలోనే ఆదర్శ రాజకీయ దిగ్గజంగా సోనియా గాంధీ చరిత్రలో నిలిచిపోయారని తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి శాఖ కార్పొరేషన్ చైర్మన్ పొదెం వీరయ్య వ్యాఖ్యానించారు. భద్రాచలంలో సోమవారం తన క్యాంపు కార్యాలయంలో జరిగిన సోనియా గాంధీ పుట్టినరోజు వేడుకలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా పొదెం వీరయ్య మాట్లాడుతూ…భారతదే దేశానికి గాంధీ కుటుంబం చేసిన సేవను గుర్తు చేశారు. సోనియా గాంధీ భావజాలాలను వివరించారు. ప్రధానమంత్రి పదవిని సైతం విడిచిపెట్టిన వైనాన్ని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తూ ఎన్ని ఆటంకాలు,ఎంత నష్టం జరిగిన మాట ప్రకారం నిలిచిన కాంగ్రెస్ దిగ్గజం సోనియమ్మని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీని క్రమశిక్షణతో ముందుకు నడుపుతూ సోనియమ్మ దిక్సూచిలా నిలిచిందన్నారు. భారతదేశాన్ని అగ్రదేశాల సరసన చేర్చటంలో సోనియమ్మ చూపిన చొరవ దేశ ప్రజలందరూ మర్చిపోలేరని తెలిపారు. దేశంలో భవిష్యత్తు కాంగ్రెస్ దేనిని, ఇందిరమ్మ రాజ్యం తెలంగాణలో లాగా,మళ్లీ దేశవ్యాప్తంగా చూస్తామన్నారు.
భద్రాచలం నియోజకవర్గంలో త్వరలో జరిగే గ్రామ పంచాయతీ, మండల పరిషత్ ఎన్నికల్లో కాంగ్రెస్ అన్ని స్థానాలను గెలుచుకుంటుందని, కాంగ్రెస్ జెండా రెపరెపలాడుతుందని ఆయన జోష్యం చెప్పారు. కష్టపడిన కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలకు పార్టీలో సముచిత స్థానం లభిస్తుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది.