మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోనియా గాంధీ 79 వ జన్మదిన వేడుకలు సోమవారం రోజున కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు సోషల్ మీడియా వారియర్స్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేసి ఘనంగా నిర్వహించారు. జైపూర్ మండలం సోషల్ మీడియా కోఆర్డినేటర్ కే సతీష్ కుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సోనియా గాంధీ కృషితో వచ్చిందని,60 సంవత్సరాల తరబడి ప్రజలు, యువకులు,నిరుద్యోగులు యువత బలిదానాలతో చలించిపోయిన సోనియా గాంధీ ఆంధ్ర పాలకుల నిర్లక్ష్యాన్ని వారి దోపిడిని తెలుసుకున్న సోనియా గాంధీ నాటి యూపీఏ ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందని తెలియజేశారు.
సీనియర్ నాయకులు జన్మదిన వేడుకలకు దూరం
గత నాలుగు నెలల నుండి జైపూర్ మండలంలోని అనేక గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఒకరి మీద ఒకరు వ్యతిరేకంగా ప్రచారం చేసుకుంటూ వ్యక్తిగత దూషణలకు పాల్పడుతూ,సొంత ప్రయోజనాల కోసం పార్టీకి గ్రామాలలో చెడ్డపేరు తీసుకవచ్చే విధంగా ప్రవర్తిస్తున్నారని అనేకమంది బయట ప్రచారం చేస్తున్నారు.జైపూర్ మండలంలో కాంగ్రెస్ పార్టీ గ్రూపులుగా విడిపోయి ఒకరి మీద ఒకరు స్థానిక శాసనసభ్యుడు వివేక్ దృష్టికి తీసుకవెళుతున్నారని జోరుగా ప్రచారం జరుగుతుంది.కష్టపడి పనిచేసి గ్రామస్థాయిలో కాంగ్రెస్ బలాన్ని పెంచే విధంగా నాయకులు ఏమాత్రం అభివృద్ధి కార్యక్రమాలు చేయడం లేదని అనేక వాదనలు వినబడుతున్నావి.స్థానిక శాసనసభ్యుడు వివేక్ వెంకటస్వామి,స్థానిక పెద్దపెల్లి పార్లమెంటు సభ్యుడు గడ్డం వంశీకృష్ణ మండల పర్యటనలో ఉన్నప్పుడు గంటల గంటలు ఎదురుచూసే మండల సీనియర్ నాయకులు తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ జన్మదిన వేడుకల్లో పాల్గొనక పోవడం చాలా బాధాకరమని మండలంలోని ప్రజలు నాయకులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ కార్యక్రమంలో జైపూర్ మండలం యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అరుణ్,చెన్నూరు నియోజకవర్గం కాంగ్రెస్ యూత్ వైస్ ప్రెసిడెంట్ సృజన్,మండలంలోని వివిధ గ్రామాల సోషల్ మీడియా వారియర్స్,ప్రేమ్ యాదవ్,సాయి,రవి గౌడ్,తిరుమల వాసు,వెంకటేష్,శివ తదితరులు పాల్గొన్నారు.