`బతికున్నంత కాలం కేసీఆర్ తోనే ఉంటానని హరీష్ ఎప్పుడో చెప్పారు.
`అనేక సార్లు ఈ విషయం స్పష్టం చేస్తూనే వస్తున్నారు.
`పదే పదే పని లేని దరిద్రులు హరీష్ మీద అసత్య ప్రచారం చేస్తూనే వున్నారు.
`రాజకీయమంతా బీఆర్‌ఎస్ లోనే కేసీఆర్ తోనే అని హరీష్ వంద సార్లు చెప్పారు.
`అయినా నీచపు రాజకీయం చేసేవారు అబద్దాలు ప్రచారం చేస్తూనే వున్నారు.
`ఎన్ని రకాల ప్రచారాలు చేసినా కుట్ర దారుల కలలు నెరవేరవు!
`కేసీఆర్ కుడి భుజం హరీష్ ను పార్టీ నుంచి కదపలేరు!
`హరీష్ ధ్వజ స్తంభంలా వుండగా బీఆర్‌ఎస్ ను ఒంటరి చేయలేరు.
`తిక్క పనులు చేసి తిన్నింటి వాసాలు లెక్క పెట్టిన వాళ్ళు పోయారు!
`జీవితమిచ్చిన పార్టీకే వెన్నుపోటు పొడిచారు.
`వారి స్వార్ధ రాజకీయం కోసం పార్టీని మునగాలని కోరుకుంటున్నారు.
`ఆత్మాభిమానం ముసుగులో దూరం జరిగారు!
`పార్టీ కష్టకాలంలో వున్నప్పుడు తమ దారి చూసుకున్నారు.
`అలాంటి వారికి బీఆర్‌ఎస్ గురించి మాట్లాడే హక్కు లేదు.
`అన్యాయం గురించి మాట్లాడే నైతికత అసలే లేదు.
`ఆత్మ ద్రోహం చేసుకున్న వాళ్ళు సొల్లు పురాణాలు ప్రచారం చేస్తే ఎవరూ నమ్మరు.
`ఎవరి దారి వాళ్ళు చూసుకొని ఇంకా బీఆర్‌ఎస్ మీద పగతో రగిలి పోతున్నారు.
`బీఆర్‌ఎస్ లేకుండా పోవాలని పగటి కలలు కంటున్నారు..
`శత్రువులతో చేతులు కలిపి కపట నాటకమాడుతున్నారు.
`నడి గోదారి చూసుకొని గందరగోళం తెచ్చుకున్నారు.
`చెప్పుడు మాటలు విని ఇప్పటికే మొదటికే మోసం తెచ్చుకున్నారు.
`నిజం గ్రహించలేక మంది మాటలు పట్టుకున్నారు.
`ఎండమావులను వెతుక్కుంటూ వెళ్లిపోయారు.
`ఇంకా బీఆర్‌ఎస్ మీద విషం చీమ్ముతూనే వున్నారు.
`బీఆర్‌ఎస్ నుంచి హరీష్ ను దూరం చేయాలని కపట నాటకాలు ఆడుతూనే వున్నారు.
`హరీష్ ను దూరం చేసి బీఆర్‌ఎస్ పని అయిపొయిందని చెప్పాలనుకుంటున్నారు.
చీల్చితే చీలేది ఈఆర్‌ఎస్ కాదు.. బీఆర్‌ఎస్ బలహీనంగా లేదు.
బలమైన క్యాడర్ తో ఎంతో దృఢంగా వుంది.
కృషార్జునులు లాంటి ఇద్దరు నాయకుల కాపలాలో కెసిఆర్ నాయకత్వంలో పటిష్టంగా వుంది
హైదరాబాద్, నేటిధాత్రి: తప్పుడు వార్తలు, సత్యదూరమైన విషయాలు, విషం చిమ్మే ప్రయత్నాలు, అసత్యాలను పదే పదే ప్రచారం చేయడం మొదలైనవి చేయడం రాజకీయ పార్టీలు బాగా అలవాటు చేసుకున్నాయి. రాజకీయ నాయకుల మనోధైర్యం దెబ్బతీస్తున్నాయి. ఒకరిని ఒకరు నమ్మే పరిస్తితి లేకుండా చేసుకుంటున్నారు. పార్టీల మధ్య విద్వేషాలు రగలించుకుంటున్నారు. రాజకీయ పార్టీల ఉనికినే ప్రశ్నార్ధం చేయాలన్న దుర్మార్గమైన ఆలోచనలు సాగిస్తున్నారు. అందుకు తగ్గట్టుగా నిజమేనా అని అందరూ నమ్మేలా నిజం మచ్చుకు కూడా లేని విషయాలను పదే పదే ప్రజల దృష్టికి తీసుకెళ్తున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఈ తరహా ప్రచారం విసృతమైపోయింది. నిత్యం అబద్దాలే ప్రచారం చేసుకుంటూ రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారు. సహజంగా పాలక పక్షం మీద ప్రతిపక్షాలు రాజకీయ దాడి చేయడం గతంలో వుండేది. కాని ఇప్పుడు పాలకపక్షాలు పాలనను గాలికి వదిలేసి, నిత్యం రాజకీయం చేయడం అలవాటు చేసుకుంటున్నారు. ఇది దేశ వ్యాప్తంగా జరుగుతూనే వుంది. అందులో ఏ రాష్ట్రం మినహాయింపు కాదు. ఏకంగా అబద్దాల యూనివర్సిటీలనే నిర్వహిస్తున్నారు. తెలంగాణలో గత పదేళ్ల కాలంగా ఇదే సాగుతోంది. కాకపోతే గతంలో ప్రతిపక్షాలు పాలకపక్షాల మీద విపరీతమైన అడ్డగోలు ప్రచారాలు సాగిస్తూ వుండేవారు. పాలకులు ఇవేవీ పట్టించుకోకుండా పనులు చేసుకుంటూ పోయేవారు. కాని ఇప్పుడు పరిస్దితి మారిపోయింది. ప్రతిపక్షం ప్రజల తరపున పనిచేస్తుంటే, పాలకపక్షం మాత్రం ప్రతిపక్షాన్ని మరింత నిర్వీర్యం చేసే రాజకీయాలు చేస్తున్నాయి. పాలన అటకెక్కించాయి. అందుకు సోషల్ మీడియా వేదికలు బాగా పాలకపక్షానికి ఉపయోపగపడుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో బిఆర్‌ఎస్ లేకుంటే బాగుండు అనుకునే రాజకీయ పక్షాల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. బిఆర్‌ఎస్ వుంటే తమ రాజకీయాలు సాగవని వారికి బలంగా తెలుసు. బిఆర్‌ఎస్‌ను రాజకీయంగా ఎదుర్కొవడం అంత సులువైన పని కాదని తెలుసు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు అనేది ఆ పార్టీ బలం కాదు. ప్రజల్లో వున్న కొద్ది అసంతృప్తి మూలంగా కాంగ్రెస్ బైట పడిరది. అదికారంలోకి వచ్చింది. ఇక అధికారం ఇలాగే నిలబెట్టుకోవాలంటే బిఆర్‌ఎస్ లేకుండా చేయాలి. బిఆర్‌ఎస్‌లో చీలికలు తేవాలి. అందు కోసం అబద్దాలు పదే పదే ప్రచారం చేయాలని చూస్తున్నారు. అందుకు వారికి కొన్ని రాజకీయ అస్త్రాలు కూడా తోడౌతున్నాయి. బిఆర్‌ఎస్‌లో ఆధిపత్యమే కావాలని కోరుకునే వారు ఆ పార్టీకి దూరమయ్యారు. బిఆర్‌ఎస్‌లో వున్నంత కాలం పార్టీకి పట్టుగొమ్మ, పునాది లాంటి నాయకుడైన హరీష్‌రావును ఎలాగైనా పార్టీ నుంచి పంపించే ఎత్తుగడలు అనేకం వేశారు. కాని కుదలేదు. వారి మాటలు పార్టీ అదినేత కేసిఆర్ వినలేదు. పార్టీకి హరీష్‌రావు ఎంత మూల స్ధంభమో పార్టీ అదినేతకు తెలుసు. హరీష్‌రావు వుంటే తమ పప్పులు ఉడకవు అని పార్టీలో పెత్తనం కోసం ఆరాటపడిన వారికి తెలుసు. అందుకే ఆది నుంచి హరీష్‌రావును ఎలా సాగనంపాలన్నదానిపై అనేక శుక్రాచార్య ఎత్తుగడలు వేశారు. కాని కుదరలేదు. ఎందుకంటే హరీష్ స్దానం దక్కించుకోవాలని చూశారు. నిజానికి హరీష్‌రావు ఎప్పుడూ పార్టీలో పెత్తనం కోసం ఆశించలేదు. ఆరాపటపడలేదు. ఎప్పుడూ తాను ఒక సామాన్య కార్యకర్తగానే వున్నారు. పార్టీని భుజాన మోస్తూ వస్తున్నారు. పార్టీ అదికారంలో వున్నా తన పార్టీకి పనులు విషయంలో తన శక్తికి మించి పని చేయడమే తెలుసు. పార్టీని నిలబెట్టడమే తెలుసు. పార్టీని కాపాడడమే ఆయనకు తెలుసు. అందుకే ఎన్ని రాజకీయ అడ్డంకులు ఎదురైనా వాటిని అవలీలగా ఎదుర్కొంటూ ముందుకు సాగారు. ఆయన మీద పగపట్టిన వారు మాత్రం ఇంకా బుసలు కొడుతూనే వున్నారు. అయినా హరీష్‌ను పార్టీ నుంచి బైటకు పంపడం అనేది సాద్యమయ్యేది కాదు. పార్టీలో అసలు ఆ చర్చే ఉత్పన్నం కాదు. ఎందుకంటే ఆయనపై రకరకాల ఆరోపణలు గతం నుంచి చేస్తూనే వున్నారు. రాళ్లు వేస్తూనే వున్నారు. కాని ప్రజలు మాత్రం హరీష్ నాయకత్వానికి పూలు మాత్రమే చల్లుతున్నారు. దీవెనలందిస్తున్నారు. ఇది కొందరికి నచ్చడం లేదు. రాజకీయంగా హరీష్ ఒక్కొమెట్టు ఎక్కడం వారికి అసలే గిట్టడం లేదు. చివరికి వారి వారి రాజకీయాలకన్నా, హరీష్ రావు రాజకీయం మీదనే దృష్టిపెట్టి తమ రాజకీయాన్ని నాశనం చేసుకున్నారు. తమ రాజకీయం తలకిందులౌతున్నా సోయిలేని రాజకీయాలు చేయాలనే చూశారు. హరీష్‌రావు ఒకసారి కాదు, ఇప్పటికి వందసార్లు చెప్పారు. తన రాజకీయమంతా బిఆర్‌ఎస్‌లోనే..తప్ప మరో ఆలోచన వుండదు. రాదు. అలాంటి పరిస్దితే వస్తే రాజకీయాలనుంచి దూరమౌతానే తప్ప మరో పార్టీ అనే ఆలోచన కలలో రాదు. బతికుండా ఆ ఆలోచన చేయను. అన్నారు. ఇంత సూటిగా, స్పష్టంగా అనేక సార్లు చెప్పారు. పైగా ఇదే ఆఖరు సారి అని గత ఎన్నికల సమయంలో కూడా చెప్పారు. తనకు పార్టీ ఇప్పటికే ఇవ్వాల్సిందానికన్నా ఎక్కువ ఇచ్చింది. ఇంకా నాకు ఏవేవో కోరికలు లేవు. ఆశలు అంతకన్నా లేవు. అని కూడా ఆయన స్పష్టం చేశారు. కాని ఆయన మాటలను పట్టించుకోకుండా హరీష్ పార్టీలో వుంటే తమ రాజకీయం సాగదని అనుకొని తన గోతిని తాను తీసుకున్న వారు కూడా వున్నారు. సహజంగా ఏ పార్టీ నాయకుడైనా, పార్టీ కార్యకరైనా సరే పార్టీకి బలమైన నాయకులు వుండాలని కోరుకోవాలే గాని, బలహీనమైన నాయకులు వుండాలని స్వార్ధపరులు కోరుకుంటారు. అలాంటి స్వార్ధపరులు ప్రతి పార్టీలోనూ వుంటారు. సొంతమనుషులే అలాంటి దిక్కుమాలిన ఆలోచనలు చేస్తుంటారు. సొంత పార్టీనే పోతే ఎంత వుంటే అంత అని కూడా అంటుంటారు. అందకే వాళ్లు పోతే ఎంత, వుంటే ఎంత అని పార్టీ కూడా అనుకున్నది. పార్టీ నుంచి పంపించేసింది. అయినా వారి కడపు మంట చల్లారలేదు. సొంతగా రాజకీయం చేస్తామని బీరాలు పలికి, ఇతర పార్టీలలోకి తొంగి చూడడమే చేస్తున్నారు. హరీష్‌రావు పక్కకు జరిగితే మళ్లీ దూరుదామని చూస్తున్నారు. లేదా తమ కళ్ల ముందు బిఆర్‌ఎస్ పేక మేడలా కూలిపోవాలని కోరుకుంటున్నారు. ఇంత దిక్కుమాలిన రాజకీయాలు చరిత్రలో ఎవరూ చేసి వుండరు. కాని అయిన వాళ్లే అలా చేస్తున్నారు. కన్న తల్లి లాంటి పార్టీకి ఇప్పటికే వెన్నుపోటు పొడిచారు. అభిమానం ముసుగేసుకొని కొంత కాలం మొసలికన్నీళ్లు కార్చి కపట నాటకాలు ఆడారు. ఇంకా ఆడాలనే చూస్తున్నారు. పార్టీని లేకుండా చేయాలన్న కుట్రలు పన్నుతూనే వున్నారు. హరీష్‌ను పార్టీ నుంచి పంపడం వారికి సాద్యం కాలేదు. కాదని తెలుసు. అందుకే మరో ఎత్తుగడ వేయాలని చూస్తున్నారు. గతంలో పార్టీకి హరీష్‌రావు వల్లనే నష్టమంటూ ప్రచారం చేశారు. ఇప్పుడు హరీష్‌రావు పార్టీ మారుతున్నారని అసత్య ప్రచారం సాగిస్తున్నారు. బిజేపి పెద్దలతో హరీష్‌రావు మంతనాలు సాగిస్తున్నారని లేనిపోనివి సృష్టిస్తున్నారు. నిత్యం ప్రజల్లో వుంటూ, ప్రతిక్షణం కార్యకర్తల మద్యలో వుండే హరీష్‌రావు మీద ఎలాంటి ప్రచారాలు సాగించినా చెల్లవని తెలుసు. అయినా ఒక విషయాన్ని పదే పదే ప్రచారం చేస్తే నిజమని నమ్మేవాళ్లు వుంటారని అనుకొని గోబెల్స్ ప్రచారం సాగిస్తున్నారు. ఇలా తాజాగా అసత్యాలను ప్రచారం చేస్తున్న వారికి గట్టిగా బుద్ది చెప్పేలా పార్టీయే సమాదానం చెప్పింది. ఇలాంటి అసత్యాలకు హరీష్‌రావు సమాదానం చెప్పాల్సిన పనిలేదు. గతంలో హరీష్‌రావును మాత్రమే టార్గెట్ చేసే వారు. ఇప్పుడు హరీష్‌రావును అడ్డుపెట్టుకొని పార్టీకే ఎసరు పెట్టాలని చూస్తున్నారు. పదేళ్ల పాటు పదవులు అనుభవించి, మొదటి నుంచి పార్టీ పేరు చెప్పుకొని పబ్బం గడుపుకున్న వాళ్లే ఇప్పుడు విషం చిమ్ముతున్నారు. కడుపులో వున్నదంతా కక్కెస్తున్నారు. తమ అసలు రూపం చూపి ంచుకుంటున్నారు. రాని కన్నీళ్లతో తిమ్మిని బమ్మిని చేయాలని చూస్తున్నారు. జనం నమ్మకపోవడంతో మరింత క్షోభకు గురౌతూ, అక్కసును మరింత పెంచుకుంటున్నారు. ప్రజలు ఆదరణ కరువు కావడంతో పిచ్చెక్కి పిచ్చిప్రేలాపనలు చేస్తున్నారు. ఇంతకంటే ఎక్కువ వాళ్లు చేసేది ఏమీ వుండదు. ఎందుకంటే బిఆర్‌ఎస్‌కు హరీష్‌రావు పునాది. బిఆర్‌ఎస్‌కు హరీష్‌రావు ఆత్మ. తన ఇరవై ఆరేళ్ల జీవితమంతా పార్టీకి ధారపోసిన నాయకుడు హరీష్‌రావు. తెలంగాణ ఉద్యమం కోసం కేసిఆర్‌తో కలిసి తొలి అడుగులు వేసిన కుటుంబ సభ్యుడు హరీష్‌రావు. అలాంటి హరీష్‌రావుకు పదవులు అవసరం లేదు. పార్టీ పది కాలాలపాటు సాగితే చాలు. తెలంగాణ వున్నంత వరకు పార్టీ రాజకీయాలు సాగితే చాలు అనుకుంటారు. తెలంగాణ తెచ్చిన పార్టీగా బిఆర్‌ఎస్‌ను కాపాడుకుంటూనే వుంటారు. తెలంగాణ సాధనలో హరీష్‌రావు పాత్రను ఎవరూ చెరిపేయలేరు. పార్టీకి దూరం ఎవరూ చేయలేరు. వారి దుష్టపన్నాగాలు సాగవు.
