చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
పెద్దపెల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ
జైపూర్,నేటి ధాత్రి:
చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి,పెద్దపెల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పత్తి రైతుల ఇబ్బందులపై స్పందించారు.అదే క్రమంలో వారు సంయుక్తంగా మంచిర్యాల జిల్లాలో పత్తి కొనుగోలు జాప్యం పై బుధవారం ఢిల్లీలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కలిసి చర్చించారు.ఈ సందర్భంగా వారు పత్తి కొనుగోలు విషయంలో సీసీఐ నుంచి రైతులకు ఎదురవుతున్న ఇబ్బందులను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి వాటిని తొలగించాలని విజ్ఞప్తి చేశారు.ఆన్లైన్ సర్వర్ పనిచేయని నేపథ్యంలో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఆధార్ కార్డుతో మాన్యువల్ ద్వారా పత్తి కొనుగోలు చేపట్టాలని కోరినారు.సీసీఐ షరతుల కారణంగా చిన్న సన్నకారు రైతులు అవస్థలను గుర్తించాలన్నారు.సానుకూలంగా స్పందించిన కిషన్ రెడ్డి కేంద్ర టెక్స్ టైల్ మినిస్టర్,సీసీఐ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సిఎండి లలిత్ కుమార్ తో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లుగా జిల్లాలోని రైతాంగానికి సమాచారం ఇచ్చారు.