Drinking Water Issue Resolved in Gunjethi
గుంజేటిలో త్రాగునీటి సమస్యకు పరిష్కారం
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని గుంజేటి గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్యకు పరిష్కారం లభించింది.గ్రామంలోని 10వ, 4వ వార్డుల్లో నీటి కొరతపై మాజీ జడ్పిటీసీ చంద్రప్ప, జహీరాబాద్ ఎంపీ సురేష్కుమార్ షెట్కార్ దృష్టికి తీసుకెళ్లారు. ఎంపీ రూ.3.50 లక్షల నిధులను మంజూరు చేయడంతో 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన నిధులతో బోరు బావులు త్రవ్వించి, రెండు బోర్లకు మోటార్లు అమర్చి తాగునీటి సరఫరాను శనివారం ప్రారంభించారు. దీంతో కాలనీ వాసులకు నీటి ఇబ్బందులు తొలగిపోయాయి. భవిష్యత్తులో నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు కొనసాగించాలని గ్రామస్థులు కోరారు.
