
Training
ఆదివాసీల,మావోయిస్టులపై సైనికుల దాడులు ఆపాలనీ డిమాండ్
సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు నిరసన
గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా) నేటిధాత్రి:
కర్రెగుట్ట ప్రాంతంలో కొనసాగుతున్న నరమేధాన్ని ఆపాలని,ఆపరేషన్ కగార్ ను నిలిపివేయాలనీ
కర్రెగుట్ట ను చుట్టుముట్టిన సైనిక బలగాలు వెనక్కి రావాలి, మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరపాలి. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరుతూ సిపిఐ (ఎం ఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా గుండాల మండల కేంద్రంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా సిపిఐ (ఎం ఎల్) న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు గుండాల మాజీ సర్పంచ్ కొమరం సీతారాములు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలు జరపాలనిమేధావులు నుండి పెద్ద ఎత్తున డిమాండ్ ముందుకు వస్తున్న బిజెపి నరేంద్ర మోడీ,అమిత్ షా ప్రభుత్వాలు స్పందించకపోవడం సరికాదని అన్నారు.
గత జనవరి నుండి ఇప్పటివరకు మావోయిస్టుల పేరుతో అనేకమంది ఆదివాసీలను చంపివేశారని అన్నారు.
దేశ సరిహద్దుల్లో ఉండాల్సిన మిలటరీ సాయుధ బలగాలు మధ్య భారత దేశంలో ఆదివాసీలపై దాడులు చేస్తున్నాయని విమర్శించారు.
ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరిపి ఆదివాసీల మారనాన్ని ఆపాలని డిమాండ్ చేశారు
ఈ కార్యక్రమంలో సిపిఐ (ఎం ఎల్) న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు ఆల్ ఇండియా ట్రైబల్ ఫోరం( ఏఐటిఎఫ్) జాతీయ కన్వీనర్ ముక్తి సత్యం, రాష్ట్ర నాయకులు ఈసం కృష్ణన్న,న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు అరెం నరేష్, పర్శక రవి, యాసారపు వెంకన్న, గడ్డం లాలయ్య, పెండకట్ల పెంటన్న, ఈసం మంగయ్య,మానాల ఉపేందర్, బానోతు లాలు, భూఖ్య వెంకన్న, పాయం ఎల్లన్న, గోగ్గల శ్రీను, మోకాళ్ళ సూర్యనారాయణ , దుగ్గి శేఖర్, వాగబోయిన బుచ్చయ్య,అరెం సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.