సోలార్ విద్యుత్ తో ఆదా…

ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు

తిరుప‌తి(నేటి ధాత్రి) ఫిబ్రవరి 08:

ప్ర‌ధాన‌మంత్రి సూర్య ఘ‌ర్ యోజ‌న ప‌థ‌కాన్ని ప్ర‌జ‌లు వినియోగించుకోవాల‌ని ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు కోరారు. సూర్య‌ఘ‌ర్ ప‌థ‌కంపై అవ‌గాహాన‌కు ఏపి ఎస్పీడీసిఎల్ సోలార్ కంపెనీల‌తో ఏర్పాటు చేసిన ఎగ్జిబిష‌న్ ను ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు ప్రారంభించారు. ఆదివారం వ‌ర‌కు ఈ ఎగ్జిబిష‌న్ జ‌ర‌గ‌నుంది.సోలార్ కంపెనీలు ఏర్పాటు చేసిన సోలార్ ప్యాన‌ల్స్ ను అధికారుల‌తో క‌లిసి ఎమ్మెల్యే ప‌రిశీలించారు. 2024లో కేంద్ర ప్ర‌భుత్వం సూర్య ఘ‌ర్ యోజ‌న ప‌థ‌కం తీసుకొచ్చింద‌ని ఈ ప‌థ‌కం కింద సోలార్ రూప్ టాప్ ఏర్పాటు చేసుకునే వారికి యాభై శాతం స‌బ్సీడి ప్ర‌భుత్వం అందిస్తుంద‌ని ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు తెలిపారు.2027 నాటికి కోటి ఇళ్ళ‌కు సౌర విద్యుత్ అందించాల‌ని కేంద్ర‌ప్ర‌భుత్వం నిర్ణ‌యించింద‌ని ఆయ‌న చెప్పారు. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోది ఆలోచ‌న‌ల‌కు అనుగుణంగా ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడు,ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ లు సోలార్ విద్యుత్ వినియోగాన్ని పోత్రాహిస్తున్నార‌ని ఆయ‌న తెలిపారు. సోలార్ రూప్ టాప్ ఏర్పాటుతో నాలుగేళ్ళ‌కు పెట్టిన ఖ‌ర్చు తీరిపోను 26 ఏళ్ళ పాటు సౌర విద్యుత్ పొంద‌వ‌చ్చ‌ని ఆయ‌న వివ‌రించారు. బ్యాంకులు సైతం ఈ ప‌థ‌కానికి త‌క్కువ వ‌డ్డీతో లోన్లు ఇస్తాయ‌ని ఆయ‌న చెప్పారు. ఈ కార్య‌క్రమంలో సీజీఏం లు రమణ దేవి,డి ఎస్ వరకుమార్,ఎస్ ఈ సురేంద్ర నాయుడు,ఈఈ చంద్రశేఖర్ రావు, డీఈ బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!