
Telangana Madiga Journalists Forum
మాదిగ జర్నలిస్టుల ఫోరం పోస్టర్ ఆవిష్కరించిన సోదా
పరకాల నేటిధాత్రి
ఆగస్టు 12వ తేదీన హైదరాబాదులోని రవీంద్ర భారతిలో జరిగే తెలంగాణ మాదిగ జర్నలిస్టుల ఫోరం 2వ మహాసభల పోస్టర్ ను జర్నలిస్ట్ లతో కలిసి పరకాల పట్టణ కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యులు మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ సోదా రామకృష్ణ ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ మాదిగ జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర అధికార ప్రతినిధి పెండెల సుమన్,మాదిగ జర్నలిస్టుల ఫోరం హన్మకొండ జిల్లా అధ్యక్షులు చందల రాజు,జిల్లా ప్రధాన కార్యదర్శి కోడెపాక భాస్కర్,నడి కూడా మండల అధ్యక్షులు,జిల్లా కార్యవర్గ సభ్యులు చుక్క సతీష్,జిల్లా నాయకులు పెండెల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.