
Social values
సామాజిక విలువలు దిగజారుతున్నాయి….!!!!
◆ :- దోపిడీ వ్యవస్థకు ప్రజలు అలవాటవుతున్నారు…….!!!!!!
జహీరాబాద్ నేటి ధాత్రి:
అవినీతి సమాజంలో ఎంత లోతు గా వేళ్లూనుకుని రాజ్యామెలుతుందో.ఈ మధ్య కాలం లో అవినీతి నిరోధక శాఖకు దొరికిన కొన్ని అణిముత్యాల ఆస్తుల వివరాలే ప్రత్యక్ష సాక్ష్యామిస్తున్నాయి.చిరు ఉద్యోగులు సైతం వందల కోట్లకు అధిపతులు గా ఎదగడం వ్యవస్థలోని లొసుగులను చూపిస్తున్నాయి.స్వార్థ ప్రయోజనాల కోసం, ప్రతి చెడు పనిలో మంచి ఉందనే నమ్మకం సమాజం లోకి మెల్లి మెల్లి గా చొప్పించ బడుతుంది.ఫలితంగా ప్రజలు దోపిడికు అలవాటై పోయారు.పైసా లేనిది పని కాదనే సత్యాన్ని జీవితం లో ఓ భాగంగా చేసుకున్నారు. ఏ చిన్న పనైనా, పెద్ద పనైనా అధికారులైన, నాయకులైన సమర్పణ సమర్పించుకోవాల్సిందేనని ఫిక్స్ అయిపోయారు.అలవాటయ్యేలా వాస్తవానికి పరిస్తితులు స్టించబడ్డాయి.సమాజం లో పరపతి, పదవి లేకపోతే పచ్చి నిజం కూడా వచ్చి అబద్దంగా చిత్రీకరించ బడుతుందనే విధంగా వ్యవస్థల పని తీరు.దీనికి తోడు ఈ వ్యవస్థలకు రాజకీయ అంద ఉండడంతో నిజం న్యాయం అనే పదాల పై నమ్మకం మెల్లి మెల్లిగా తగ్గుతుంది.మెజారిటీ ప్రజలకు ధర్మ బద్దమైన పరిష్కార విధానం అనే వాక్యాల పై నమ్మకం సన్నగిల్లితుంది.సంస్థల్లో అవినీతిమయం.ఏ కార్యాలమైన లంచాల విధానం లేకుండా సాగే పరిస్థితులు లేవు.

మినుకు మినుకు మనే వెలుతురు లా అక్కడక్కడ అరా కోరా అధికారులు అవినీతి రహిత కార్యాలయాల కోసం ప్రయత్నాలు చేసినా అంతగా సఫలం కాలేక పోతున్నారు.రాజకీయ ప్రోద్భలం ఉపయోగించి అలాంటి అధికారులను బదిలీ చేయిస్తున్నా విషయాలు వెలుగు లోకి వచ్చాయి కూడా, అధికారం తోముడిపడి పదాధికారులు చెప్పు చేతుల్లో వ్యవస్థలు కీలు బొమ్మలై చంప బడుతున్నాయి.రాజకీయ దోపిడీ ట్రెండ్ మారి విధానం లో మార్పులు వచ్చాయి.ప్రజలను దోపిడీలో భాగస్వాములను చేసి, దోచుకోవడం లాంటి కొత్త ఆవిష్కరణ తో, అవినీతి హుందాగా దరాగా వర్ధిల్లుతుంది, చేసే ఆవినీతి ను అభివృద్ధి గా, చూపించుకోవాడానికి సవాలక్ష దారులున్నాయి.ముఖ్యంగా నమ్మే జనాలున్నారు.రాజకీయం పేరిట దోచుకోవడం అంటే ఎవరికి కూడా ఆశ్చర్యం వెయ్యడు.ఎందుకంటే ప్రజలు ఈ పద్ధతికి అలవాటు పడి పోయారు.జనాల్ని తమ తో కట్టి పెట్టుకునేందుకు కొన్ని పద్ధతులు అవలంబిస్తున్నారు.అందులో ముఖ్యమైనవి పధకాలు, వాస్తవంగా కొంత వరకు ఈ పధకాలు జనాలకు మేలు చేసేవి ఉన్నా అంతా కంటే ఎక్కువ ఓటు బ్యాంక్ రూపం పనికొస్తున్నాయి.రక రకాల పధకాలతో, ప్రతి పది మంది లో ఏడుగురు లబ్ది దారులైన తర్వాత జనల్లో ఏది నిజం, ఏది అబద్ధం అనే ఆలోచన నే రాధు.ఇంకా జనం లో పట్టు కోసం కుల పరంగా లెక్కలు చూసుకుని ఆయా కుల సంఘ నాయకులకో పదవి, కాస్త పరపతి కల్పిస్తే వారందరూ గుప్పిట్లో ఉంటారు.తద్వారా గ్రామ గ్రామం వరకు రాజకీయ పట్టు నిలుపుకోవచ్చు.మన సమాజం లో జరుగుతుంది ఇదే.ఈ మధ్య కొన్ని మద్యమాలు కూడా వీటికి తొడయ్యాయి.ఏదో ఓ విషయం పై చర్చ, ఆ చర్చ తో ఓ కొత్త వివాదని తెర లేపి, జనాల్ని రెండు మూడు భాగాలుగా విడదీసి, పాలకుల పని తీరును ప్రశ్నించే సమయం లేకుండా జనాల్ని మరో వైపు మళ్లించడం లో టి. వి. చానెళ్లు తమ వంతు పాత్ర పోషిస్తున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు.బదులుగా ప్రకటన లతో చానెళ్లు లబ్ది పొందడం, ఇలా ఒకదానితో మరొకటి ముడిపడి అవినీతి రాజ్య మేలుతుంది.సమాజంలో మార్పు కోరుకునేవారు లక్షల్లో వున్నారు కానీ వర్తమాన సమాజానికి అన్వయించ దగిన సరికొత్త రాజకీయ సిద్ధాంతం వారి వద్ద లేదు.అబద్దపు హామీ లు ఇస్తున్న కిక్కు వాస్తవ చేదు నిజల్లో దొరకదు, అందుకే జనం ఎవరెక్కువ పధకాలు ప్రకటిస్తే వారి వెంట వెళ్ళేందుకు సిద్ధంగా ఉన్నారు.జరుగుతున్నది తప్పని అక్కడక్కడ కొంతమంది.గొంతు చించుకుని అరుస్తున్నా వినేందుకు జనం సిద్ధంగా లేరు.సంస్కరణల కోసం సంఘర్షణ చేసిన వారెవరూ అంత సునాయాసంగా ప్రజల విశ్వాసాన్ని పొందలేకపోయారు.స్వయంగా మహాత్మా గాంధీ చేసిన స్వాతంత్య్ర పోరాట ఉద్యమాన్ని వ్యతిరేకించిన వారున్నారు.దేశ స్వాతంత్య్ర్యం ప్రకటించ బడిన తర్వాత కూడా, బ్రిటిష్ కు మద్దతుగా ర్యాలీ లు నిర్వహించిన వారున్నారు.సమయం. దాటిన తర్వాత పరిస్తితులకు తల వగ్గే జనాలు సమాజం లో ఎక్కువ..అందుకే కాబోలు, పెద్ద పెద్ద సంఘ సంస్కర్తలు సమాజం నుంచి తిరస్కరించ బడ్డ వారే ఎక్కువ.సామాజిక, రాజకీయ, సంస్కతిక విలువల్ని కాపాడేందుకు సంఘ సంస్కర్తల కోసం వేచి చూడకుండా జనమే మేల్కొనాలి.గళం వినిపించాలి.పెద్ద పెద్ద ఉద్యమాలు చేయ లేక పోయినా వ్యక్తిగతంగా తన వంతు మార్పు కోసం యువత నడుం బిగించాలి.మేధావి వర్గం కూడ అవినీతి రహిత మానవీయ సమాజాన్ని నిర్మించడానికి అడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.