సోషల్ ప్రోగ్రామింగ్

హసన్ పర్తి/ నేటి ధాత్రీ

పైన గల మొదటి బొమ్మలోని వాడు పసి వాడు. వీడికి మూఢనమ్మకాలుండవు,మానసిక జాఢ్యాలుండవు,కుల ద్వేషాలుండవు, మత మౌఢ్యాలుండవు, ప్రాంతీయ పెనుగులాటలుండవు,సంస్కృతీ సరంజామా ఉండదు.
ముఖ్యం గా వాడికి తన కులం ఏదో, మతం ఏదో, ప్రాంతం ఏదో తెలియదు.
కానీ వాడికి సహజాత లక్షణాలుంటాయి.తన చెల్లి దగ్గరున్న బిస్కట్ ని లాక్కొంటాడు. తను ఆడుకొనే బొమ్మ లాక్కొన్న వాడి తమ్ముడి మీద వాడికి కోపం వస్తుంది. మళ్ళీ ఓ గంటలోనే అదంతా మర్చిపోయి తమ్ముడి తో ఆడు కొంటాడు.వాడికి పుట్టుక తోనే సహజం గా వచ్చిన లక్షణాలు స్వార్ధాన్ని, కోపాన్ని సపోర్ట్ చేస్తున్నాయి.
కొంచెం పెరిగి హై స్కూల్ లెవెల్ కి వచ్చినాక తన క్రికెట్ బాట్ లాక్కొన్న వాడిమీదికి ముందుగా కోపం వస్తుంది. ఆ లాక్కొన్న సంఘటన ను గుర్తుపెట్టుకొని కొన్నేళ్ల వరకూ లాక్కొన్నవాడిని ద్వేషిస్తాడు.పెరుగుదలతో పాటు వచ్చిన మెమరీ ద్వేషాన్ని సపోర్ట్ చేస్తోంది.
డిగ్రీ కి వచ్చే సరికి బాట్ లాక్కొన్నవాడి తో పాటు లాక్కొన్నవాడి కులాన్ని కూడా ద్వేషించటం మొదలు పెడతాడు.ఇద్దరు వ్యక్తుల మధ్య వ్యవహారం లోకి కులాన్ని అసోసియేట్ చేసుకొని కులాన్ని లాగటం మొదలయింది.
మొదటి బొమ్మలోని పసి వాడు పెరిగి రెండో బొమ్మలోని ముప్పయ్యేళ్ల వాడయ్యాడు. వీడికి కుల ప్రిజుడిస్, మత పిచ్చి,ప్రాంతీయ అభిమానం,ఆచారాలు గా చెలామణి అయ్యే మూఢనమ్మకాలు, వాటిని పోషించే రిచువల్స్,కల్చర్ పేరు తో సాగిన బ్రెయిన్ వాష్ అన్నీ ఉన్నాయి.
కానీ విషాదం ఏమిటంటే వాడి ఈ లోపాలేవీ వాడికి కనపడవు(మన ముఖం మనకంటికి కనపడనట్లు).ఒక వేళ కనపడినా బయటికి మాత్రం తనకు ఈ లోపాలు లేనట్లే నటిస్తాడు.
కానీ ఎదుటివాడిలోని ఈ లోపా లు మాత్రం వాడికి భూతద్దం లో కనపడుతాయి.
వాడి ముఖం వాడికి కనపడాలంటే అద్దం లోకి చూడాలి. వాడి లోపాలు వాడికి తెలియాలంటే, “మానవ సంబంధాలు అనే అద్దం” లో వాడిని వాడు పరిశీలించుకోవాలి.
ఇంతకీ ఏ లోపాలూ లేని మొదటి బొమ్మలోని పసి వాడు ఎన్నో లోపాలున్న రెండవ బొమ్మలోని యువకుడి గా మారటం వెనుక ఉన్న కారణం ఎవరు?సమాజం వలన వాడికి కలిగిన అనుభవాలా?
అలానే వాడు ఒక గొప్ప.సమాజ సేవకుడిగా, మహనీయుడి గా కూడా రూపాంతరం చెందవచ్చు. దానికి కారణం ఎవరు? ఏ పరిస్థితులలో సన్నాసి అవుతాడు?ఏపరిస్థితులలో మహనీయుడు అవుతాడు?
సమాజం లోని ఒక వర్గం వాడి వర్గం మీద వివక్ష చూపితే వాడిలో ఆ వివక్ష చూపిన వర్గం మీద ద్వేషం కలుగుతుంది. ఆ వివక్ష ఉన్నా ఈ ద్వేషం కలగకుండా ఉండటం కుదరదా?
ఎదుటి వర్గం మొత్తం మీద కాకుండా వివక్ష చూపిన వ్యక్తుల మీద మాత్రమె ద్వేషం కలగటం జరగని పనియా?
ఎదుటి వర్గం లో వివక్ష చూపని అనేకులు ఉంటారు. మొత్తం ఎదుటి వర్గాన్ని ద్వేషిస్తే, వివక్ష చూపని వారిని కూడా ఈ ద్వేషపు మడుగులోకి లాగినట్లు కాదా?అటువంటి మంచివారిని నిర్లక్ష్యం చేసినట్లు కాదా?
ఎదుటి వర్గం మీద ఎంతో ప్రిజుడిస్ చూపించే వారు, అదే ఎదుటి వర్గం లోని తమ ఫ్రెండ్స్ కు మాత్రం మినహాయింపు ఇస్తారు ఎందుకు?
ఆ అనుభవాలు కలిగినా వాటిని పక్కన పెట్టి, వాడు పసివాడిలా ఉండలేడా? వాడి అనుభవాలకు వాడు ఒక కీలుబోమ్మా?
వయసు పెరిగిన కొద్దీ నాలెడ్జ్ తో పాటు దురభిమానాలు, ద్వేషాలు,పక్షపాతాలు ఎందుకు పోగుపడ తాయి? ఎందుకు మనిషి వ్యక్తిత్వం మార్పును తిరస్కరిస్తూ గడ్డ కట్టుకొనిపోతుంది. గతాన్ని గుర్తుంచుకొనకపోతే బయాస్ లు ఉండవు. కానీ నాలెడ్జ్ కూడా ఉండదు. మైండ్ ని ఓపెన్ గా ఉంచుకొని, జెనరలైజ్ చేయకుండా, కేస్ బై కేస్ బేసిస్ మీద మనిషి ఎందుకు ఆలోచించలేడు?
ఉన్నత వర్గం కావచ్చు, నిమ్న వర్గం కావచ్చు,ఏ వర్గానికైనా సొంత లాభం కొంత మానుకోవటం ఎందుకు కష్టమవుతుంది?

మొత్తం గా అనుభవాలను పక్కనపెడితే నేర్చుకోవటం ఉండదు కదా? అప్పుడు అనుభవాల లోని ఉపయోగ పడే విషయాలను నేర్చుకోలేడు కదా?
అనుభవాల లోని చెడు విషయాలను పక్కన పెట్టి, మంచి విషయాలను నేర్చుకోవటమే కదా విజ్ఞత అంటే?
ఎదుటి వాడు తనమీద వేసిన రాళ్ల తో ఇల్లు కట్టుకోవాలనటం అర్ధం లేని శ్రీరంగనీతా?
అసలు ఈ రాళ్లు వేసే మెంటాలిటీ ఎక్కడినుంచీ వస్తుంది?
మరి ఈ విజ్ఞత ఎక్కడ నుంచీ వస్తుంది? తల్లితండ్రులు, చదువు ఈ విజ్ఞత ను ఇవ్వాలా?
సమాజం లో విజ్ఞత కొరవడినపుడు తల్లితండ్రులలోనూ విజ్ఞత కొరవడుతుంది.
చదువు అనేది సమాజ హితం కోసం మేధావులు సృష్టించిన ఉపకరణం. మరి చదువు లోనే అంతర్లీనం గా ప్రిజుడిస్ ప్రవేశిస్తే, ఇక ప్రిజుడిస్ లేని మైండ్ ఎలా సాధ్యం?
నేర్చుకోవటం అనేది వ్యక్తిగత అనుభవాల ద్వారా కాకుండా సార్వ జనీన గణాంకాల ద్వారా అయితే ప్రిజుడిస్ కొంతవరకూ తగ్గుతుందా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!