గీత కార్మికులను సాంఘిక బహిష్కరణ చేసిన వారిని కఠినంగా శిక్షించాలి.
రాజ్యాంగ విరుద్ధమైన వి,డి, సి లను నిషేధించాలి.
మంగపేట నేటిధాత్రి
కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు
నిజామాబాద్ జిల్లా తాళ్ల రాంపూర్ గ్రామంలో గీత కార్మికులను సాంఘిక బహిష్కరణ చేసి, శ్రీరామనవమి నాడు గుడిలోకి వచ్చిన మహిళలను గెంటివేసి అవమానపరిచి,ఉపాధి కల్పించే ఈత చెట్లను తగులబెట్టిన వి డి సి సభ్యులను తక్షణమే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని కల్లు గీత కార్మిక సంఘము మంగపేట మండల కమిటీ డిమాండ్ చేశారు. మంగపేట మండల పరిధిలోని వివిధ గ్రామాలలో మండల కమిటీ ఆధ్వర్యంలో తాళ్లరాంపూర్లో జరిగిన వి డి సి పెద్దలను తక్షణమే అరెస్ట్ చేయాలనీ కల్లు గీత కార్మికుల తో నిరసన చేయడం జరిగింది.
నిజామాబాద్ జిల్లా తాళ్లరాంపూర్ లో రాజ్యాంగ విరుద్ధంగా ఏర్పాటు చేసిన వి డి సి కమిటీల అరాచకాలు రోజురోజుకు ఎక్కువ అవుతున్నాయని,తాళ్ల రాంపూర్ లో తాళ్లు ఎక్కతు న్నందుకు వి డి సి కి డబ్బులు ఇవ్వలేదనే కక్షతో కల్లు గీత వృత్తినే నమ్ముకునీ జీవనం కొనసాగీస్తున్న గీత కార్మికులను తాళ్లు ఎక్కద్దని కల్లు ఎవరు తాగద్దని చాటింపు వేయడం దుర్మార్గమైన చర్య అని అన్నారు,పైగా ఈనెల 6న శ్రీరామనవమి పండుగ సందర్బంగా గౌడ మహిళలు గుడికి వస్తే మీరు గుడికి రావద్దు అని బయటకు పంపి బహిష్కరణ చేసిన వి డి సి కమిటీపై చట్టరిత్య చర్యలు తీసుకోవాలని కమిటీ సభ్యులు ప్రభుత్వాన్ని కోరారు.నిజామాబాద్ జిల్లాలో వివిధ వృత్తులు చేస్తున్న
కుర్మ,యాదవులు,ముదిరాజ్, బెస్త,వడ్డెర,నాయి బ్రాహ్మణ, నేత,మరియు దళితులు తదితరచేతి వృత్తిదారులను సాంఘిక బహిష్కరణ చేస్తున్న వి డి సి లను శాశ్వతంగా లేకుండా నిషేధించాలని కమిటీ పెద్దలు అన్నారు..

ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు లోడే శ్రీనివాస్ గౌడు, మండల గౌడ సంఘము అధ్యక్షులు రావుల శ్రీనివాస్ గౌడు గాజుల ఈశ్వర్ గౌడు, గాజుల వెంకటేశ్వర్లు గౌడ్, గంట చిట్టిబాబు గౌడ్, బూర శ్రీనివాస్ గౌడ్, కమలాపూర్ గ్రామం గౌడ సంఘం నుండి పానుగంటి వెంకటేశ్వర్లు గౌడ్, బోనగాని యాదగిరి గౌడ్, జాడి శేఖర్ గౌడ్, బూర సాంబయ్య గౌడ్, పంజాల సత్యం గౌడ్, పందాల హరిబాబు గౌడ్, ఓరగంటి రాంబాబు గౌడ్, బూర నరేష్ గౌడ్, గుండెబోయిన శీను గౌడ్,శేఖర్ గౌడ్ కోరుకొప్పుల రాము గౌడ్, కోరుకొప్పుల సత్యం గౌడ్, కుప్పల పున్నం రావు గౌడ్, చిన్న చంద్రం గౌడ్, పెద్ద చంద్రన్న గౌడ్,ఉడుగుల సాంబయ్య గౌడ్ వీరితో పాటు మిగతా గ్రామాల నుండి 40 మంది గీత కార్మికులు పాల్గొన్నారు.