లక్ష రూపాయల చెక్కు అందించిన సామాజిక కార్యకర్త ఇమ్రాన్ మోహియోద్దీన్
జహీరాబాద్. నేటి ధాత్రి:
మజ్లిస్ మాజీ స్పీకర్ మరియు హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు దివంగత శ్రీ సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీ జ్ఞాపకార్థం, ప్రముఖ సామాజిక కార్యకర్త ఇమ్రాన్ మొహియుద్దీన్, సామాజిక కార్యకర్త మొహమ్మద్ సమీర్ అబ్దుల్ లతీఫ్ కలిసి కోహిర్ మండల్ మద్రి గ్రామానికి చెందిన 6 రోజుల కుమార్తెకు చికిత్స పొందుతూ మరణించిన మృతురాలి భర్త మంగళై నవీన్ కుమార్ కు లక్ష రూపాయల చెక్కును విరాళంగా అందించారు. ఈ సందర్భంగా,ఏఐఎంఐఎం ప్రధాన కార్యదర్శి జహీరాబాద్ టౌన్ ముహమ్మద్ రఫీ ముహమ్మద్ వాజిద్, ఏఐఎంఐఎం గ్రామ పంచాయతీ అధ్యక్షుడు దగ్వాల్, షేక్ ఇలియాస్ జాయింట్ సెక్రటరీ జహీరాబాద్, ముహమ్మద్ యూనస్ రజా ఏఐఎంఐఎం అధ్యక్షుడు కృష్ణపూర్, ఇమ్రాన్ అబ్దుల్ గఫర్, అజీమ్ పటేల్, మల్లేష్ ముహమ్మద్ అన్వర్ మరియు మాద్రి గ్రామ పంచాయతీ నివాసితులు తదితరులు పాల్గొన్నారు.