నిద్రపోతున్న “నిఘా” నేత్రాలు.
బ్రేకింగ్ న్యూస్, నేటిధాత్రి, వరంగల్
పాత సెంట్రల్ జైలుకు సంబంధించిన ఇండియ న్ ఆయిల్ పెట్రోల్ బంకులలో కొన్ని రోజులుగా పనిచేయని సీసీ కెమెరాలు?
భద్రకాళి కమాన్ ఎదురుగా, ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంపులలో, ఏ ఒక్క సీసీ కెమెరా కూడా పనిచేయని పరిస్థితి చూస్తే ఆశ్చర్యం కలగకమానదు..!

ఇక్కడ ఉన్న సీసీ కెమెరాలు అన్నీ కూడా డమ్మీ అని సమాచారం?
నగర నడిబొడ్డున, ప్రధాన రహదారిలో, ప్రభుత్వరంగ సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న రెండు పెట్రోల్ పంపులలో, కనీసం ఏ ఒక్క సీసీ కెమెరా కూడా పనిచేయని పరిస్థితి.
ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది ఎవరు? ఉన్నతాధికారులు తనీకిలు చేయాల్సిన అవసరం లేదా? అని ప్రశ్నిస్తున్న వాహనదారులు.
ఇదే విషయంపై వెళ్లి ఫోటోలు, వీడియో తీస్తున్న మీడియా ప్రతినిధులపై అక్కడే ఉన్న పోలీసు సిబ్బంది అసహనం..

సూపరిండెంట్ పర్మిషన్ ఉంటేనే ఫోటోలు తీయాలి అంటున్న పోలీసు సిబ్బంది.
ఎక్కడ లేని వింత అనే చెప్పొచ్చు? నగర ప్రధాన రహదారిలో, ఇంత పెద్ద పెట్రోల్ బంకుల్లో ఉన్న సిసి కెమెరాల వైర్లు పరిశీలిస్తే సగం కట్ అయి ఉండటం తద్వారా అవి డమ్మీ అని వాటిని చూస్తే అర్థమవుతున్న తీరు.
ఇప్పటికైనా సదరు సూపరిండెంట్ కానీ, స్థానిక పోలీసులు అయిన చొరవ తీసుకొని సీసీ కెమెరాలు అన్ని పనిచేసేలా చూడాలని వాహనదారులు కోరుతున్నారు.