వైద్యం.. నైవేద్యం.. తిమింగలం!!.. ఎపిసోడ్‌-1

-గడగడలాడిస్తారనుకుంటే ‘‘గప్‌ చుప్‌’’ గా తప్పించారు?

-సీఎం ‘‘రేవంత్‌ రెడ్డి’’ లేని సమయంలో ‘‘గడల’’కు స్వేచ్చ ప్రసాదించారా? 

-’’గడల’’ చేసిన అవినీతి తెలిసినా మాఫ్‌ చేయడంలో ఆంతర్యమేమిటి!

-‘‘గడల’’ అవినీతి మీద పోరాటం చేస్తున్న ‘‘ఎస్‌.కే. ప్రసన్న’’ చెప్పిన అనేక ఆసక్తికరమైన అంశాలు ఆమె మాటల్లోనే…

-కరోనా సమయంలో ‘‘గడల’’పై అనేక ఆరోపణలు!

-‘‘గడల’’పై వున్న అవినీతి ఆరోపణలపై చర్యలు లేనట్లేనా!

-గతంలో కాంగ్రెస్‌ పెద్దలందరూ ‘‘గడల’’ను విమర్శించిన వాళ్లే!

-ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కూడా ‘‘గడల’’పై అప్పట్లో ఆరోపణలు గుప్పించారు.

-తీరా చూస్తే ‘‘గడల’’ను ఇప్పుడు వెనకేసుకొస్తున్నారు!

-వాలెంటరీ రిటైర్‌ మెంట్‌ ఇచ్చేశారు.

-తాంబూలాలిచ్చి సాగనంపుతున్నారు.

-‘‘గడల’’ అక్రమ సంపాదనపై విచారణ అవసరం లేదని తేల్చేశారా!

-ఇంత కాలం ‘‘గడల’’ అవినీతిపై పోరాటం చేస్తున్న వారి కష్టం వృధానేనా!

-సామాజిక బాధ్యతతో ‘‘గడల’’ అవినీతి చిట్టాలు విప్పిన వారి పిర్యాదులు బుట్టదాఖలేనా!

-గత ప్రభుత్వం ‘‘గడల’’ను పెంచిపోషించిందన్నారు?

-ఇప్పుడు గడలను స్వేచ్ఛా జీవిని చేశారు.

-పాలకులెవరైనా అవినీతి పరులకు కొమ్ము కాయడమేనా!

-వందల కోట్ల ఆరోపణలున్న ‘‘గడల’’ మీద కనీసం విచారణ కూడా చేపట్టరా?

-రాజకీయంగా ‘‘గడల’’కు రెడ్‌ కార్పెట్‌ పరిచినట్టేనా?

-‘‘గడల’’ను ఇలా కాపాడాక…కక్కించే వారెవరు!!

-‘‘గడల’’ను బయటపడేస్తే బాగుపడే వారెవరు? 

-పైలా పచ్చీసులో అవినీతి పరులకే పాలకుల ఆశీర్వాదాలు!

-జనం నెత్తిన శఠగోపాలు!

-ప్రజారోగ్యంలో నిర్లక్ష్యం చేసిన వారికి అందలమా!

-‘‘గడల’’ చేసిన అవినీతి మరకలు తుడిచేయడమా!

-అవినీతిని అంతం చేస్తామని చెప్పింది ఒట్టి మాటేనా!

-అవినీతి పరులను కాపాడడమే అసలు వ్యవహారమా!

హైదరాబాద్‌,నేటిధాత్రి:   

ఒక వ్యక్తి వ్యవస్ధను నాశనం చేశాడని ఆరోపణలున్నాయి…వైద్యశాఖను గడల శ్రీనివాస్‌ అనే ఉన్నతోద్యోగి భ్రష్టు పట్టించారన్న విమర్శలు పుష్కలంగా వున్నాయి. వైద్యశాఖకు కేంద్రం నుంచి వచ్చిన నిధులన్నీ కాజేశాడన్న ఆ శాఖలో పనిచేసే ఉద్యోగులు గగ్గోలు పెట్టిన సందర్భాలు అనేకం వున్నాయి. అందుకు తగిన సాక్ష్యాధారాలతో సహా గత పాలకులు, ఇప్పటి పాలకులకు నివేదికలు అందించిన వాళ్లు కూడా వైద్యశాఖలో వున్నారు. ఎప్పుడెప్పుడు గడల శ్రీనివాస్‌ ప్రభుత్వ నిధులను ఎలా దుర్వినియోగం చేశాడన్నదానిపై లెక్కలతో సహా చెప్పిన వాళ్లు వున్నారు. అయినా గత పాలకులు అతన్నే నెత్తిన పెట్టుకున్నారు. ఆయనపై వచ్చిన ఆరోపణలు పట్టించుకోలేదు. కనీసం ఏనాడు జరిగిందేమిటీ అన్నదానిపై ఆరా తీయలేదు. పైగా ఆయనకు మరింత ప్రాదాన్యతనిస్తూ వచ్చారు. ఎవరు ఎంత చెప్పినా, ఎవరు ఎన్ని పిర్యాదులు చేసినా పట్టించుకోనంతగా గడలకు ప్రాదాన్యతనిస్తూ వచ్చారు. కారణాలు ఏమిటన్నది ఉద్యోగులు ఆ విషయాలను పూస గుచ్చినట్లు బైట పెట్టిన ఉదంతాలు కూడా వున్నాయి. అయినా వాటిని గత పాలకులు ఎవరూ పట్టించుకోలేదు. కనీసం కొత్తగా వచ్చిన రేవంత్‌ రెడ్డి ప్రభుత్వమైన గడల మీద చర్యలు తీసుకుంటుందని ఎదురుచూశారు. గడలపై విచారణకు ఆదేశిస్తారనుకున్నారు. కొత్త ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత గడలపై వున్న ఆరోపణలతో కూడిన నివేదికలను, అందుకు సంబంధించిన రికార్డులను కూడా ప్రస్తుత వైద్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు అందజేసిన వాళ్లున్నారు. అందులో ఎస్‌కే. ప్రసన్న ఒకరు. ఆమె ప్రజాధనం దుర్వినియోగమౌతుందని, వైద్య వ్యవస్ధ నిర్వీర్యమౌతుందని బాధపడి అప్పటి గడల శ్రీనివాస్‌ అవినీతిపై రిపోర్టులు అందించారు. అంతే కాదు ఆమె కొత్తగూడెం నియోజకవర్గంలో గడల శ్రీనివాస్‌ చేసిన అవినీతికి సంబంధించిన వివరాలు పొందుపర్చి, ఇంటింటికీ కరపత్రాలు కూడా పంచారు. అలా గడల శ్రీనివాస్‌ రాజకీయాలలోకి రాకుండా చేశారు. అంతలా వైద్య వ్యవస్ధమీద మమకారంతో, ఒక బాద్యత కల్గిన ఉద్యోగిగా ఎస్‌కే. ప్రసన్న కృషి చేస్తే, పాలకులు ఆమె విన్నపాలను బుట్ట దాఖలు చేశారు. గడల శ్రీనివాస్‌ విషయంలో ఆమె నేటిధాత్రికి చెప్పిన విషయాలను ఆమె వెల్లడిరచారు. గడల శ్రీనివాస్‌పై విచారణ జరిపించాలని ప్రభుత్వాలకు లేఖలు రాశారు. ఆయనపై సిబిఐ చేత విచారణ జరిపించాలని కూడా డిమాండ్‌ చేశారు. అక్రమ మార్గాల ద్వారా గడల శ్రీనివాస్‌ పదోన్నతులు పొందారన్న ఆరోపణలున్నాయి. అలా అక్రమ మార్గంలో పదోన్నతులు పొందతూ పెద్దఎత్తున అవినీతికి పాల్పడ్డారన్న విమర్శలు వున్నాయి. అప్పటి ప్రభుత్వ పెద్దల ఆశీస్సులతో, అప్పటి ఉన్నతాధికారులను ప్రసన్నం చేసుకొని పదోన్నతులు పొందాడని తెలుస్తోంది. అలా గడల శ్రీనివాస్‌ ఇస్టాను సారం వ్యవహరిస్తూ, శాఖలో ట్రాన్ఫ్‌ఫర్లు, డిప్యూటేషన్లుతో కోట్లు సంపాదించారని ప్రసన్న ఆరోపిస్తున్నారు. అంతే కాదు ప్రభుత్వం నుంచి విడుదలైన కోట్లాది రూపాయల నిధులను దుర్వినియోగం చేసినట్లు కూడా ప్రసన్న చెబుతున్నారు. అందుకు సంబందించిన సాక్ష్యాదారాలు చూపించారు. ఇక కరోనా సమయంలో ఆయన కొన్ని వందలకోట్లు దుర్యినియోగం చేసినట్లు ఆమె పెద్దఎత్తున ఆరోపణలు చేశారు. 

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రతిపక్షంలో పిపిసి. అధ్యక్షుడుగా వున్న సమయంలో కూడా గడల శ్రీనివాస్‌ మీద పెద్దఎత్తున ఆరోపణలు చేసిన సందర్బాలున్నాయి. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన మీద చర్యలుంటాయని అందరూ ఎదురుచూశారు. కాని అది జరగకపోగా తాజాగా రాష్ట్ర ఫ్రభుత్వం గడల శ్రీనివాస్‌కు వాలెంరటీ రిటైర్మెంట్‌ ఇచ్చిందన్న వార్త విని వైద్యశాఖ ఉద్యోగులు నివ్వెర పోతున్నారు. ఎలా జరిగిందనేదానిపై ఆరాలు తీస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి లేని సమయం చూసి గడలకు వాలెంటరీ రిటైర్‌మెంటు ఇచ్చారా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇంత పెద్ద నిర్ణయం ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి తెలిసి జరిగిందా? లేక తెలియకుండానే జరిగిపోయిందా? అన్నది తెలాల్సివుంది. ఒక ముఖ్యమంత్రికి తెలిసి జరిగితే గతంలో ఆయనపై వచ్చిన ఆరోపణల్లో నిజం లేదని ప్రభుత్వం ఒప్పుకున్నట్లేనా? ఎలాంటి విచారణ జరక్కుండానే క్లీన్‌ చిట్‌ ఇచ్చినట్లేనా? అన్న సందేహాలు వ్యక్తమౌతున్నాయి. అయినా ఇంత హడావుడిగా నిర్ణయం తీసుకొని వాలెంటరీ రిటైర్‌మెంటు ఎందుకిచ్చారన్నదానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. నీటి పారుదల శాఖలో, విద్యుత్‌శాఖలో జరిగిన అవినీతి మీద పెట్టిన శ్రద్ద వైద్య రంగంలో జరిగిన అవినీతి, అందుకు బాద్యుడైన గడల శ్రీనివాస్‌ను ఎందుకు ప్రభుత్వం ఉపేక్షించిందన్నదానిపై పెద్దఎత్తున రచ్చ జరుగుతోంది. ఒకసారి గతంలో గడల చేసిన హంగామా ఎలా వుండేదన్నదానిని గుర్తు చేస్తే అప్పటి ముఖ్యమంత్రి కేసిఆర్‌కు పదే పదే కాళ్లకు దండంపెడుతూ వచ్చేవారు. తనకు కొత్త గూడెం టికెట్‌ వస్తుందని పదే పదే తనే ప్రచారం చేసుకుంటూ వచ్చేవారు. అప్పటి ముఖ్య మంత్రి నివాసమైన ప్రగతిభవన్‌కు వెళ్లి ఆయనను ప్రసన్నం చేసుకోవడం, వైద్యశాఖను భ్రష్టు పట్టించడం తప్ప ఆయన విధులు నిర్వర్తించింది లేదంటారు. అలా ముందుకు ఆయన అప్పుడే వాలెంటరీ రిటైర్‌ మెంటు తీసుకొని ఎమ్మెల్సీ కావాలని శత విధాల ప్రయత్నం చేశారు. కాని కుదరలేదు. అదే సమయంలో కొత్తగూడెం అప్పటి ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమరుడి వ్యవహారం రాష్ట్రంలో సంచనలం సృష్టించింది. దాంతో వనమాకు బిఆర్‌ఎస్‌ టికెట్‌ రాదన్న నిర్ధారణకు వచ్చిన గడల శ్రీనివాస్‌ తన విధులను పక్కన పెట్టి రాజకీయాల వైపు చూశారు. కొత్తగూడెం టికెట్‌ నాకే అంటూ పెద్దఎత్తున ప్రచారం చేసుకున్నాడు.

కొత్త గూడెంలో గుళ్లలో పూజలు, యాగాలు నిర్వహించేవారు. పండుల వేళ ఆయా మతాలకు చెందిన వ్యక్తులతో సమావేశాలు ఏర్పాటు చేసి పాల్గొంటూ వుండేవారు. గుళ్లో పూజలు చేస్తూ, ఆ భగవంతుని ఆశీస్సుల వల్లే కరోనా పోయిందని అన్నారు. తర్వాత మరో మతానికి చెందిన వేదికలో ఏసు ప్రభువు మూలంగానే కరోనా పారిపోయిందన్నారు. కోట్లలో సంపాదించిన అవినీతి సంపాదనను నీళ్లలా ఖర్చు చేస్తూ ప్రచారం చేసుకున్నారు. ఇక కొత్తగూడెం యువత ఓట్లు దండుకునేందుకు గడల ఫౌండేషన్‌ పేరుతో యువతకు లేని పోని ఆశలు చూపి, వారి పేర్లు , నెంబర్లు సేకరించి ఎన్నికల్లో టికెట్‌ సంపాదించుకొని లబ్ది పొందాలని చూశాడు. కాని బిఆర్‌ఎస్‌ టికెట్‌ ఇవ్వలేదు. కొత్త ప్రభుత్వం వచ్చిన వెంటనే కాంగ్రెస్‌ పంచన చేరాలని చూశాడు. కాని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దూరం పెట్టారని అప్పట్లో వార్తలు వచ్చాయి. గత పార్లమెంటు ఎన్నికల్లో ఎంపిగా పోటీ చేయాలని శతవిధాల ప్రయత్నం చేశాడు. కాని కుదరలేదు. అలా ఆయనను పక్కన పెట్టిందనుకున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం గడల మీద విచారణ చేస్తుందని అందరూ అనుకున్న వేళ ఆయనకు వాలెంటరీ రిటైర్‌మెంటు అనుమతివ్వడంతో సర్వత్రా చర్చనీయాంశమైంది. బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం అదికారంలో వున్నంత కాలం కేసిఆర్‌ దేవుడితో సమానం అన్నాడు. ఆయన ఆశీస్సులతో డిహెచ్‌ అయ్యాడు. పెద్దఎత్తున అవినీతి చేసి, సొమ్ము పోగేసుకొని రాజకీయాల్లో చేరాలనుకున్నాడు. ఇప్పుడు కాంగ్రెస్‌ పంచన చేరి రాజకీయ భవిష్యత్తుకు మార్గం వేసుకోవాలనుకున్నాడు. కాని అది కుదలేదు. కాని వాలెంటరీ రిటైర్మెంటు మాత్రం కుదిరింది. ఒక ఉద్యోగి తన జీవితంలో ఎంత సంపాదించినా వందల కోట్లు మాత్రం కూడబెట్టుకోలేదు. కాని అవినీతి చేసిన వాళ్లే వందల కోట్లు వెనకేసుకుంటారు. అలాంటి వారిని రాజకీయా పార్టీలు చేరదీయడం విడ్డూరం. అవినీతి చేసిన వారి అంతు చూస్తామని చెప్పిన కాంగ్రెస్‌ ప్రభుత్వ పెద్దలు గడల శ్రీనివాస్‌కు వాలెంటరీ రిటైర్‌ మెంటు ఇవ్వడపై కూడా అనుమానాలకు తావిచ్చారు. అది ప్రభుత్వానికి కూడా మంచిది కాదు. అవినీతి పరుడికి అండగా నిలవడం అంటే అవినీతిని పాలకులు కూడా ప్రోత్సహించినట్లే అన్న సంకేతాలు బలంగా వెళ్తాయి. అందువల్ల గడల శ్రీనివాస్‌ వాలెంటరీ రిటైర్‌ మెంటు క్యాన్సిల్‌ చేసి, ఆయనపై సిబిఐ విచారణ చేపట్టాలని ఎస్‌కే ప్రసన్న డిమాండ్‌ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!