నిజాంపేట: నేటి ధాత్రి ఏప్రిల్ 17
జగదానంద కారుడు జగదాభిరాముడు భక్తకోటి తిరుప పేరులతో పిలుచుకునే భద్రాద్రి రాముడీ కల్యాణ వేడుకలు కనుల పండుగగా సాగిందని వేలేటి రామ్మోహన్ శర్మ అన్నారు. మండల కేంద్రంలోని శ్రీ హనుమాన్ దేవాలయంలో శ్రీరామనవమి సందర్భంగా బుధవారం రోజున సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ మేరకు కళ్యాణం లో రాముడి తరుపున వీరమల్లు లింగం దంపతులు, సీతాదేవి తరపున స్థానిక ఎస్సై శ్రీనివాస్ రెడ్డి దంపతులు కూర్చున్నారు. ఈ సందర్భంగా ఎస్సై శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ సీతారాముల కళ్యాణం జరిపించడం చాలా సంతోషంగా ఉందన్నారు. అలాగే మండల ప్రజలందరూ పాడి పంటలతో సుఖ సంతోషాలతో విలసిల్లాలని ఆ భగవంతున్ని కోరుకున్నామని తెలిపారు. అనంతరం ఈ కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన భక్తులకు శ్రీ రామ్ దళ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ సభ్యులు గ్రామ పురోహితులు రామ్ మోహన్ చేతుల మీదుగా క్రోది నామ సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ చేశారు. ఈకార్యక్రమంలో చికోటి వెంకటేశం సిద్దరాం రెడ్డి, జీపీ స్వామి, తిరుపతి, వెంకట్ రెడ్డి, ప్రశాంత్ తదితరులు అన్నారు.